రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

Posted By:

బ్రాండెడ్ డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు సాధరణ కంప్యూటర్‌లతో పోలిస్తే రెట్టింపు ధరలను కలిగి ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో వివిధ ధర వేరియంట్‌లలో డెస్క్‌టాప్ పీసీలు లభ్యమవుతున్నాయి. బడ్జెట్ ప్రెండ్లీ ధరల్లో ఉత్తమ ఫీచర్లతో కూడిన డెస్క్‌టాప్ పీసీని పొందాలనుకునేవారికి ఈ శీర్షిక మరింత ఉపయుక్తంగా ఉంటుంది. డెస్క్‌టాప్ కంప్యూటర్ రూపకల్పనకు అవసరమైన వివిధ విడిభాగాలను మీరే కొనుగోలు చేసి రూ.30,000లో కంప్యూటర్‌ను రూపొందించుకునే మార్గాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

1.) ఇంటెల్ కోర్ ఐ3 3220 ప్రాసెసర్ (Intel Core i3 3220):

3.3గిగాహెట్జ్ సామర్ద్యాన్ని కలిగి ఉండే ఇంటెల్ కోర్ ఐ3 3220 ప్రాసెసర్ కంప్యూటర్ ఒత్తిడికి‌లోను కాకుండా చూస్తుంది. అంటే మీ కంప్యూటర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంటెల్ కోర్ ఐ3 3220 ప్రాసెసర్ మార్కెట్ ధర రూ.7,000.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

2.) ఎమ్ఎస్ఐ బీ75ఎమ్ఏ - ఈ 33 (MSI B75MA-E 33):

ఇంటెల్ బీ75 చిప్‌సెట్ ఆధారంగా రూపుదిద్దుకన్న ఈ మథర్ బోర్డ్ ఇంటెల్ కోర్ ఐ3 3220 ప్రాసెసర్‌కు మంచి జోడి. ఈ మథర్ బోర్డ్ యూఎస్బీ 3.0 సపోర్ట్ ఇంకా సాటా 6జీబీపీఎస్ కనెక్టర్‌లను కలిగి ఉంటుంది. మార్కెట్లో ఎమ్ఎస్ఐ బీ75ఎమ్ఏ - ఈ 33 మథర్ బోర్డ్ ధర రూ.3,700.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

3.) 4జీబి ట్రాన్సెండ్ ర్యామ్ (4GB Transcend RAM):

2జీబి 133మెగాహెట్జ్ ర్యామ్‌ స్టిక్‌లను రెండు తీసుకోండి. ధర రూ.1,800.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

4.) సీగేట్ 500జీబి హార్డ్‌డిస్క్ (Seagate 500GB hard disk):

ఈ పటిష్టమైన హార్డ్‌డ్రైవ్ స్టోరేజ్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తుంది. మార్కెట్లో సీగేట్ 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్ ధర రూ.3,000.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

5.) ఎల్‌జి ఆప్టికల్ డ్రైవ్ (LG optical drive):

ఈ ప్రత్యేకమైన డ్రైవ్ ద్వారా డీవీడీ ఇంకా సీడీలను రైట్ చేసుకోవచ్చు. ధర రూ.950.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

6.) కూలర్ మాస్టర్ ఎలైట్ 344 (Cooler Master Elite 344):

ఈ సీపీయూ క్యాబినెట్ సౌకర్యవంతంగా ఉంటుంది. ధర రూ.2,000.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

7.) కోర్సెయిర్ వీఎస్350 పవర్ సప్లై (Corsair VS350 power supply):

ఈ విద్యుత్ సరఫరా యూనిట్ 350 వాట్‌ల సామర్ధ్యం గల స్వచ్ఛమైన శక్తిని సరఫరా చేయగలదు. స్పైక్ ఇంకా షార్ట్ కట్ ప్రొటెక్షన్ వ్యవస్థలను వీఎస్350 పవర్ సప్లై యూనిట్ కలిగి ఉంది. మార్కెట్లో కోర్సెయిర్ వీఎస్350 పవర్ సప్లై యూనిట్ ధర రూ.2,100.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

8.) డెల్ ఎస్2240ఎల్ (Dell S2240L):

ఈ 21.5 అంగుళాల మానిటర్ పూర్తిస్థాయి హైడెఫినిషన్ రిసల్యూషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. మార్కెట్లో డెల్ ఎస్2240ఎల్ మానిటర్ ధర రూ.9,200.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

9.) లాగీటెక్ కీబోర్డ్ ఇంకా మౌస్ (Logitech keyboard and mouse):

మార్కెట్లో లాగిటెక్ కీబోర్డ్ ఇంకా మౌస్ ధర రూ.700.

రూ.30,000లో పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు చిట్కాలు!

10.) మొత్తం ఖర్చు:

రూ. 30,450.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot