బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?

|

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, అయితే ఈ అంశాలను పరిగణలోకి తీసుకోండి. టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా కంప్యూటింగ్‌ను మరింత సులభతరం చేస్తూ ట్యాబ్లెట్ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేసాయి. సరిగ్గా అరిచేతిలో ఇమిడిపోతున్న ట్యాబ్లెట్ పీసీలు ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్ వర్కింగ్ తదితర కమ్యూనికేషన్ లావాదేవీలను సమృద్ధిగా నిర్వర్తిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే వివిధ ధర వేరియంట్ లలో ట్యాబ్లెట్ పీసీలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా స్పెసిఫికేషన్ ల బట్టి ధరలు ఉంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ట్యాబ్లెట్ పీసీని కొనుగోలు చేద్దామనుకునే వారికోసం గిజ్‌బాట్ పలు సలహాలను అందిస్తోంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?

ప్రాసెసర్ ఎంపిక:

ముఖ్యంగా టాబ్లెట్ పీసీ పనితీరు ప్రాసెసర్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ ఉత్తమ కంపెనీ ప్రాసెసర్‌ను ఉండాలి. ప్రస్తుత మార్కెట్‌ను పరిశీలించినట్లయితే క్వాల్కమ్ ప్రాసెసర్‌లు మన్నికైన పనితీరును కనబరుస్తున్నాయి.

ఆపరేటింగ్ సిస్టం ఎంపిక:

మీరు ఎంపిక చేసుకోబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. ఈ వోఎస్ అనేక కొత్త అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్ వేగవంతంగా స్పందించాలి:

ప్రస్తుత ట్రెండ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ల పై నడుస్తోంది. అయితే మీరు ఎంపిక చేసుకుబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కు ఉపకరించాలంటే 1గిగాహెట్జ్ ప్రాసెసర్ సరిపోతుంది. ఇంకా వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కోరుకునే వారు తమ సామర్ధ్యాన్ని బట్లి ప్రాసెసర్‌లను ఎంపిక చేసుకోవచ్చు.

 

ర్యామ్ పనితీరు:

మీరు ఎంపిక చేసుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ మన్నికైన పనితీరును కనబర్చాలంటే 1జీబి ర్యామ్ తప్పనిసిరి. తక్కువ బడ్జెట్‌లో ట్యాబ్లెట్ పీసీని ఎంపిక చేసుకుందామనుకునే వారికి 512ఎంబి ర్యామ్ ఉత్తమం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X