మీ కంప్యూటర్ వేగంగా.. దూసుకెళ్లాలంటే!

‘పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే పలు చిట్కాలు చిట్కాలు... సిస్టమ్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వార్మ్స్, మాల్‌వేర్స్ రోజూ పెరుగుతూ ఉంటాయన్నది కామన్ థింగ్. అందుకే అప్పుడప్పుడు వైరస్ స్కాన్ చేస్తూ ఉండాలి. మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.
మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి. మీ కంప్యూటర్ సీ డ్రైవ్ మీద, లేదంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన డ్రైవ్ పైన ఎక్కువగా భారం పడకుండా చూడండి.
అంటే వీలైనన్ని తక్కువ ప్రోగ్రామ్‌లు ఇన్‌స్టాల్ చేస్తే మంచిది. మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. డిస్క్ క్లీనప్‌ను రెగ్యులర్‌గా వాడుతూ ఉండండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








