మైక్రోసాఫ్ట్ పెయింట్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

Posted By:

కంప్యూటర్ నిర్వహణపై ఇప్పుడిప్పుడే అవగాహనను ఏర్పరచుకుంటున్నవారికి ఫోటోలను రీసైజ్ చేసే ప్రక్రియ కాస్త క్లిష్టతరమైనదిగా అనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ పెయింట్(ఎంఎస్ పెయింట్) ఫీచర్‌ను ఉపయోగించుకుని ఫోటోలను సులభమైన రీతిలో రీసైజ్ చేసే విధానాన్ని నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం.

ఆండ్రాయిడ్ చిట్కా

అనుకోకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే, అందులోని ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులు వీక్షించేందుకు వీలు లేకుండా చేసేందుకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఒక సౌకర్యం ఉంది. అయితు మీరు స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకోకే ముందే మీ ఫోన్‌లోని ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్‌ను సెలెక్ట్ చేసుకుని అందులోని ‘రిమోట్లీ లొకేట్ దిస్ డివైస్', ‘అలౌ రిమోట్ లాక్ అండ్ ఫ్యాక్టరీ సెట్టింగ్' ఆప్షన్‌లను టిక్ చేసినట్లయితే విపత్కర సమయాల్లో మీ ఫోన్‌లోని సమాచారం నిక్షేపతంగా నాశనం అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ పెయింట్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ముందుగా మీ పీసీలోని ప్రధాన మెనూలోకి ప్రవేశించి ఎంఎస్ పెయింట్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

డెస్క్‌టాప్ పై ఎంఎస్ పెయింట్ అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే ఫైల్ మెనూలోకి ప్రవేశించి ఓపెన్ బటన్‌ను సెలక్ట్ చేసుకుని రిసైజ్ చేయవల్సిన ఫోటోను ఎంపిక చేసుకోండి.

 

మైక్రోసాఫ్ట్ పెయింట్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీరు ఎంపిక చేసుకున్న రిసైజ్ చేయవలసిన ఫోటో పెయింట్ అప్లికేషన్ పేజీ పై ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ‘ఇమేజ్ మెనూ'లో కనిపించే రీసైజ్ బటన్ పై క్లిక్ చేయండి.

 

మైక్రోసాఫ్ట్ పెయింట్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఇప్పుడు రిసైజ్ ఆప్షన్‌లతో కూడిన ఓ డైలాగ్ బాక్స్ డెస్క్‌టాప్ పై కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్సులో రీసైజ్ చేయవల్సిన ఫోటోకు సంబంధించి ఫోటో శాతం లేదా ఫోలో పిక్సల్ పరిమాణాన్ని మీకు కావల్సిన రీతిలో మార్చుకునే అవకాశం ఉంటుంది.

 

మైక్రోసాఫ్ట్ పెయింట్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఫోటో రీసైజింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే డైలాగ్ బాక్స్ క్రింద కనిపించే OK బటన్ పై క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా ఫోటో రీసైజ్ కాబడుతుంది. రీసైజ్ చేయబడిన ఫోటోను వేరే పేరుతో కంప్యూటర్‌లో సేవ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Tips to Resize Image by Using Microsoft Paint (Ms Paint). Read More in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot