మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?
కొద్దిపాటి రక్షణాత్మకమైన చర్యలతో మీరూ.. మీ కంప్యూటర్ ఆనందంగా ఉండొచ్చు. కంప్యూటర్‌లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

AVG లాంటి పటిష్టమైన ఉచిత సాఫ్ట్‌వేర్‌లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సైతం మంచి మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది. వీటిలో ఉపయుక్తమైనవాటిని ఇన్‌స్టాల్ చేసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మరిచిపోకండి. పెన్‌డ్రైవ్, సీడీ -డీవీడీలను వాడే ముందు వాటిని యాంటీ వైరస్‌తో స్కాన్ చేయటం మరిచిపోవద్దు.
పీసీలోని హార్డ్‌డిస్క్‌ను తరచూ స్కాన్ చేయండి. పీసీకి బూట్ లెవెల్ పాస్‌వర్డ్ ఉంచుకోవడం కూడా మంచిది. దీనివల్ల ఎవరంటే వారు పీసీని వాడలేరు. మీ డేటాను ఎప్పుడూ డి- డ్రైవ్‌లో ఉంచండి. ప్రోగ్రామ్స్ అన్నీ సి- డ్రైవ్‌లోనే ఉంచుకోండి. ఇంటర్నెట్ యాక్సెస్ చేసిన ప్రతిసారీ, కుకీస్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్‌ను డిలీట్ చేసేలా ఏర్పాటు చేసుకోండి. మీ పీసీని ఆఫ్ చేసే ముందు ఒకసారి యాంటి వైరస్‌తో స్కాన్ చేసుకోవడం మంచిది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications