కీబోర్డ్ టైపింగ్ వేగంగా నేర్చుకోవాలంటే..?

Posted By: Prashanth

కీబోర్డ్ టైపింగ్ వేగంగా నేర్చుకోవాలంటే..?

 

విద్యార్థులు మొదలుకుని వ్యాపారుల వరకు టెక్నాలజీ ప్రపంచలో రాణించాలంటే ‘కీబోర్డ్ టైపింగ్’ పై అవగాహన కలిగి ఉండాల్సిందే. పాతరోజుల్లో టైపింగ్‌లో నిష్ణాత సాధించాలంటే ఇన్స్‌స్టిట్యూట్‌కి వెళ్లి లోయరో.. హయ్యరో పాస్ అవ్వాల్సి వచ్చేది. రోజులు మారటంతో ఆన్‌లైన్ టైపింగ్ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీడియోగేమ్ మాదిరిగా డిజైన్ చేయబడిన ఈ అప్లికేషన్స్ టైపింగ్‌ను ఆడుతూ..పాడుతూ నేర్చుకుంటున్న అనుభూతిని కలిగిస్తాయి.

ప్రత్యేకించి టైపింగో కోసం రూపొందించిబడిన పలు అప్లికేషన్‌ల వివరాలు:

టైపింగ్ సులువుగా నేర్చుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కీబర్.కామ్ (www.keybr.com) ఓ సులభమైన మార్గం. ఒకే క్లిక్కుతో సాధన ప్రారంభించవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన వెంటనే హోం పేజీలో విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కీబోర్డ్ లేఅవుట్ దర్శనమిస్తుంది. దాని ఆధారంగా వేళ్లని కదుపుతూ పైన కనిపించే టైక్స్ట్ మేటర్‌ని టైప్ చేయాలి. ఏర్పాటు చేసిన స్టేటస్ బార్‌లో స్పీడ్ వేగం ఇంకా చేసిన తప్పులు కనిపిస్తాయి. ఈ అప్లికేషన్‌లోకి ఫేస్‌బుక్ ఐడీ వివరాల ద్వారా లాగిన్ అయ్యే అవకాశముంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot