మౌస్ వాడటంలో 10 మెళుకువలు

చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. కీబోర్డ్‌తో పనిలేకుండా మౌస్ సాయంతో అనేక కమాండ్‌లను నిర్వహించుకోవచ్చు. కంప్యూటర్ మౌస్‌ను తరచూ ఉపయోగించే వారి కోసం పనులను వేగవంతంగా చక్కబెట్టుకునేందుకు 10 సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్..

పోటాపోటీగా 4G Volte ఫోన్‌లు రిలీజ్, రూ.4000లోపే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

కీబోర్డ్‌లోని షిప్ట్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి మౌస్‌తో డాక్యుమెంట్ ముందు, చివరా రైట్ క్లిక్ చేయటం ద్వారా డాక్యుమెంట్‌లోని టెక్స్ట్ మొత్తం సెలక్ట్ అవుతుంది.

టిప్ 2

కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి డాక్యుమెంట్‌లోని కావల్సిన టెక్స్ట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

టిప్ 3

కీబోర్డ్‌లోని షిప్ట్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి ఫైల్ లేదా ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసినట్లయితే విస్తరించిన కాంటెక్స్ట్ మెనూను మీరు చూడొచ్చు.

టిప్ 4

ఏదైనా ఫోటోను జూమ్ చేయాలంటే, కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి మౌస్ మధ్యలోని స్ర్కోలర్‌ను ఉపయోగించటం ద్వారా ఫోటో జూమ్ అవుతుంది.

టిప్ 5

ఓపెన్ చేసి ఉన్న నోట్‌ప్యాడ్ లేదా వర్డ్ డాక్యుమెంట్‌ను డిలీట్ చేయాలంటే విండో బార్ ఎడమ వైపు పై భాగంలో డబల్ క్లిక్ ఇచ్చినట్లయితే విండోస్ క్లోస్ అవుతుంది. మినిమైజ్ లైదా మ్యాగ్జిమైజ్ చేయాలంటే విండో బార్ మధ్య భాగంగలో డబల్ క్లిక్ ఇస్తే చాలు.

టిప్ 6

ఏదైనా లింక్‌ను కొత్త ట్యాబ్‌లో ఓపెన్ చేయాలంటే కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి లింక్ పై రైట్ క్లిక్ చేసినట్లయితే లింక్ కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది.

టిప్ 7

మౌస్ మధ్యలోని స్ర్కోలర్‌ను క్లిక్ చేయటం ద్వారా బ్రౌజర్‌లోని ట్యాబ్‌లను క్లోజ్ చేయవచ్చు.

టిప్ 8

మౌస్ క్లిక్ లాక్‌ను యాక్టివేట్ చేయాలంటే మౌస్ ప్రాపర్టీస్‌లోకి వెళ్లి టర్న్‌ఆన్ క్లిక్ లాక్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లు మౌస్ లాక్ యాక్టివేట్ అవుతుంది.

టిప్ 9

కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచటం ద్వారా కాలమ్నర్ టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 computer Mouse Tips Every User Should know. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot