ఈ 10 కీబోర్డ్ షార్ట్ కట్స్ మీకు తెలుసో లేదో చెక్ చేయండి

మీరు కంప్యూటర్ వాడుతున్నారా..అయితే మీరు పని తొందరగా చేయాలనుకున్నప్పుడు షార్ట్ కట్ కీస్ కోసం వెతుకుంటారు కదా...

|

మీరు కంప్యూటర్ వాడుతున్నారా..అయితే మీరు పని తొందరగా చేయాలనుకున్నప్పుడు షార్ట్ కట్ కీస్ కోసం వెతుకుంటారు కదా...ప్రతీసారి మౌస్ దగ్గరకు చేయి తీసుకెళ్లడం వల్ల సమయంతో చాలా వరకు వృధా అవుతూ ఉంటుంది. దీనివల్ల పని తొందరగా కాదు. అలాంటి వారు కొన్ని షార్ట్ కట్ కీస్ నేర్చుకుంటే పనిని చాలా తొందరగా చేసేయవచ్చు. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి. అయితే తెలియని వారు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారికోసం ఓ 10 కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ ఇస్తున్నాం. ఓ సారి చెక్ చేసుకోండి.

రూ. 14,670కే IPhone X లాంటి స్మార్ట్‌ఫోన్,లెనోవో సంచలనంరూ. 14,670కే IPhone X లాంటి స్మార్ట్‌ఫోన్,లెనోవో సంచలనం

Ctrl+C or Ctrl+Insert and Ctrl+X

Ctrl+C or Ctrl+Insert and Ctrl+X

మీరు ఏదయితే సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని Ctrl+C or Ctrl+Insert ద్వారా కాపీ చేసుకోవచ్చు. అలాగే దాన్ని అక్కడ నుంచి కట్ చేసుకోవాలనుకుంటే Ctrl+X ఉపయోగించి కట్ చేసుకోవచ్చు.
అదే ఆపిల్ యూజర్లయితే కంట్రోల్ కీ బదులు command (cmd) key ని ఉపయోగించాలి.

Ctrl+V or Shift+Insert

Ctrl+V or Shift+Insert

మీరు కాపీ చేసుకున్న దాన్ని ఎక్కడైనా పేస్ట్ చేయాలనుకుంటే Ctrl+V or Shift+Insert ఈ రెండు ఉపయోగించి చేసుకోవచ్చు.
అదే ఆపిల్ యూజర్లయితే Cmd+V ప్రెస్ చేయడం ద్వారా ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు.

Ctrl+Z and Ctrl+Y

Ctrl+Z and Ctrl+Y

మీరు ఏదైనా మిస్టేక్ చేసిన యెడల దానికి మీరు సరిదిద్దుకోవాలనుకుంటే Ctrl+Z ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీరు కట్ చేసిన పదాన్ని కూడా ఈ కీ ప్రెస్ చేయడం ద్వారా పొందవచ్చు. Ctrl+Y నొక్కడం ద్వారా మళ్లీ యథాస్థానానికి రావచ్చు.
అదే ఆపిల్ యూజర్లయితే Cmd+Z, Cmd+Y ప్రెస్ చేయడం ద్వారా పైన వాటిని పొందవచ్చు.

Ctrl+F

Ctrl+F

ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఇంటర్నెట్ బ్రౌజర్లో ఏమి కావాలో వెతుక్కోవచ్చు. అలాగే మీరు వర్డ్ లో ఉన్నప్పుడు ఏదైనా ప్రత్యేక పదాన్ని కనుగొనాలంటే Ctrl+F ప్రెస్ చేసి ఆ పదాన్ని అక్కడ టైప్ చేస్తే సరిపోతుంది.

Alt+Tab or Ctrl+Tab

Alt+Tab or Ctrl+Tab

వీటిని ఒకేసారి ప్రెస్ చేయడం ద్వారా మీరు మీ బ్రౌజర్లో ఓపెన్ చేసిన మరో పోగ్రాంకి వెళ్లొచ్చు..
అదే ఆపిల్ యూజర్లయితే Cmd+Tab ప్రెస్ చేస్తే సరిపోతుంది.

Ctrl+Backspace and Ctrl+Left or Right arrow

Ctrl+Backspace and Ctrl+Left or Right arrow

వీటిని ప్రెస్ చేయడం ద్వారా మీరు వెనక్కి ముందుకి వెళ్లవచ్చు. మీరు మౌస్ ఉపయోగించకుండా వీటితో కావలసిన చోటుకి వెళ్లవచ్చు.ఆపిల్ యూజర్లకి ఈ సౌకర్యం లేదు.

Ctrl+S

Ctrl+S

మీరు మీ పైల్ సేవ్ చేయాలనుకుంటే Ctrl+S ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆపిల్ యూజర్లయితే Cmd+S ప్రెస్ చేస్తే సరిపోతుంది.

Ctrl+P

Ctrl+P

మీరు ఏదైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటే Ctrl+P ప్రెస్ చేస్తే నేరుగా అక్కడికి వెళ్లవచ్చు.ఆపిల్ యూజర్లయితే Cmd+P ప్రెస్ చేస్తే సరిపోతుంది.

Page Up, Spacebar, and Page Down

Page Up, Spacebar, and Page Down

Page Up టైప్ చేయడం ద్వారా మీరు మీ బ్రౌజర్లో పైనున్న స్టోరీ దగ్గరికి వెళ్లవచ్చు. అలాగే Spacebar, and Page Down ప్రెస్ చేయడం ద్వారా కింద ఉన్న స్టోరీలోకి వెళ్లవచ్చు.

Best Mobiles in India

English summary
Top 10 keyboard shortcuts everyone should know More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X