Just In
- just now
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 17 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 20 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 22 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ : విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కీలక వివరణ..
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Finance
Budget Market: మార్కెట్ పెరుగుతుందా.. పడిపోతుందా..? గత బడ్జెట్లలో ఏం జరిగిందంటే..
- Movies
Taraka Ratna: తారకరత్న పరిస్థితిపై చిరంజీవి ట్వీట్.. వాళ్లకు థ్యాంక్స్ అంటూ!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా, ఇవిగోండి 5 బెస్ట్ ఆప్షన్స్...
ల్యాప్‌టాప్ స్ర్కీన్ ఎంపిక విషయంలో చాలా మంది యూజర్లు తెగ తర్జనభర్జన పడిపోతుంటారు. వాస్తావానికి 13 అంగుళాల స్ర్కీన్‌లతో వచ్చే ల్యాప్‌టాప్‌లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఈ పోర్టబుల్ ల్యాపీలు అన్ని రకాల అవసరాలకు చాలా హ్యాండీగా ఉపయోగపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. 13 ఇంచ్ ల్యాప్‌టాప్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో డెల్, హెచ్‌పీ, లెనోవో, ఆసుస్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 13-ఇంచ్ విండోస్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వీటితో పాటు యాపిల్ కూడా 13 అంగుళాల స్ర్కీన్ మోడల్స్‌లో మ్యాక్‌బుక్‌లను ప్రొవైడ్ చేస్తుంది. నేటి స్పెషల్ స్టోరీలో భాగాంగా మార్కెట్లో లభ్యమవుతోన్న 5 బెస్ట్ 13 ఇంచ్ ల్యాప్‌టాప్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

డెల్ ఎక్స్‌పీఎస్ 13 (Dell XPS 13)
సీపీయూ విషయానికి వచ్చేసిరికి ఈ ల్యాపీ డ్యుయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ3 ఇంకా ఐ7 వేరియంట్‌లలో లభ్యమవుతోంది. గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 620 - ఇంటెల్ ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్ 640 వేరియంట్‌లలో ఈ డివైస్‌ను ఎంపిక చేసుకోవచ్చు, ర్యామ్ విషయానికి వచ్చేసరికి 4జీబి నుంచి 8జీబి వరకు వివిధ మోడల్స్‌లో ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి 13.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి (1,920 x 1,080) ఇంకా 13.3 అంగుళాల క్యూహెచ్‌డి (3,200 x 1,800) స్ర్కీన్‌లతో వస్తోన్న ఈ డివైస్ అందుబాటులో ఉంటుెంది. స్టోరేజ్ కెపాసిటీ 128జీబి నుంచి 256జీబి ఎస్ఎస్‌డి వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాపీ ధర రూ.88,990గా ఉంది. ఇదే సమయంలో అమెజాన్ ఇండియా రూ.1,12,654 ధర ట్యాగ్‌తో ఈ డివైస్‌ను విక్రయిస్తోంది.

హెచ్‌పీ స్పెక్ట్రె ఎక్స్360 (HP Spectre x360)
సీపీయూ విషయానికి వచ్చేసిరికి ఈ ల్యాపీ డ్యుయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ3 ఇంకా ఐ7 వేరియంట్‌లలో లభ్యమవుతోంది. గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 620 ఇంకా ఎన్‌విడియా జీఫోర్స్ 940 ఎమ్ఎక్స్ 2జీబి మోడల్స్‌లో ఈ డివైస్‌ను ఎంపిక చేసుకోవచ్చు, ర్యామ్ విషయానికి వచ్చేసరికి 8జీబి నుంచి 16జీబి వరకు వివిధ ర్యామ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. 13.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి (1,920 x 1,080) డిస్‌ప్లేతో పాటు 13.3 అంగుళాల యూహెచ్‌డి (3,840 x 2,160) ఐపీఎస్ యూడబ్ల్యూవీఏ ఎల్ఈడి-బ్యాక్‌లైట్ మల్టీ టచ్ డిస్‌ప్లే మోడల్స్‌లో ఈ ల్యాపీని ఎంపిక చేసుకోవచ్చు.
స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 256జీబి నుంచి 1టీబీ వరకు వివిధ రకాల SSD సపోర్ట్‌తో ఈ ల్యాపీని సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియాలో ఈ ల్యాపీ ధర రూ.1,12,796గా ఉంది.

ఆసుస్ జెన్‌బుక్ ఫ్లిప్ యూఎక్స్360 సీఏ (Asus ZenBook Flip UX360 CA)
బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో బెస్ట్ ల్యాప్‌టాప్‌గా గుర్తింపు తెచ్చుకున్నఆసుస్ జెన్‌బుక్ ఫ్లిప్ యూఎక్స్360 సీఏ ఇంటెల్ కోర్ M6Y30 సీపీయూ పై స్పందిస్తుంది. గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ హెచ్ డి గ్రాఫిక్స్ 515 చిప్ సెట్ ను ఈ డివైస్ లో నిక్షిప్తం చేయటం జరిగింది. 4జీబి ర్యామ్ తో ఈ డివైస్ లభ్యమవుతోంది. స్ర్కీన్ విషయానికి వచ్చేసరికి 13.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి (1,920 x 1,080) డిస్‌ప్లేతో ఈ ల్యాపీని సొంతం చేసుకోవచ్చు. స్టోరేజ్ పరంగా చూస్తే 128జీబి నుంచి 512జీబి వరకు వివిధ రకాల SSD సపోర్ట్‌తో ఈ ల్యాపీ లభ్యమవుతోంది. అమెజాన్ ఇండియా ఈ డివైస్ ధర రూ.82000గా ఉంది.

లెనోవా యోగా 910 (Lenovo Yoga 910)
సీపీయూ విషయానికి వచ్చేసిరికి ఈ ల్యాపీ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ పై ఈ ల్యాపీ రన్ అవుతుంది. గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 620 చిప్‌ను ఈ డివైస్‌లో పొందుపరిచారు. ర్యామ్ విషయానికి వచ్చేసరికి 8జీబి నుంచి 16జీబి వరకు వివిధ ర్యామ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. 13.9 అంగుళాల ఫుల్ హెచ్‌డి (1,920 x 1,080) డిస్‌ప్లేతో పాటు 13.9 అంగుళాల యూహెచ్‌డి (3,840 x 2,160) ఐపీఎస్ మల్టీ టచ్ డిస్‌ప్లే మోడల్స్‌లో ఈ ల్యాపీని ఎంపిక చేసుకోవచ్చు.
స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 256జీబి నుంచి 1టీబీ వరకు వివిధ రకాల SSD సపోర్ట్‌తో ఈ ల్యాపీని సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియాలో ఈ ల్యాపీ ధర రూ.56,490గా ఉంది.

13-ఇంచ్ మ్యాక్‌బుక్ ఎయిర్ (13-inch MacBook Air)
సీపీయూ విషయానికి వచ్చేసిరికి ఈ ల్యాపీ ఇంటెల్ కోర్ ఐ5 ఇంకా ఐ7 ప్రాసెసర్స్ పై ఈ ల్యాపీ రన్ అవుతుంది. గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ హెచ్‌డి 6000 గ్రాఫిక్స్ చిప్‌ను ఈ డివైస్‌లో పొందుపరిచారు. 8జీబి ర్యామ్‌తో ఈ మ్యాక్‌బుక్ స్పందిస్తుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 128జీబి నుంచి 512జీబి వరకు వివిధ ఎస్ఎస్‌డి స్టోరేజ్‌లతో ఈ ల్యాపీని సొంతం చేసుకోవచ్చు. 13.3 అంగుళాల ఎల్ఈడి హెచ్‌డి (1,440 x 900) డిస్‌ప్లేతో ఈ యాపిల్ డివైస్ ను ఎంపిక చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియాలో ఈ ల్యాపీ ధర రూ.56,300గా ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470