టాప్ - 5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

Posted By:

దేశీయంగా ఆకాష్‌తో ప్రారంభమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీల సంస్కృతి క్రమక్రమంగా మరింత విస్తరించింది. మొదటి తరం 7 అంగుళాల శ్రేణి ట్యాబ్లెట్ పీసీలను తొలిగా నవంబర్ 2011లో ఆవిష్కరించారు. తరువాతి క్రమంలో ఈ మోడళ్లు ఆధునిక ట్రెండ్‌కు మార్గదర్శకంగా నిలిచాయి.

దేశవాళీ బ్రాండ్‌లు కార్బన్, హెచ్‌సీఎల్, లావా, స్వైప్, మిలాగ్రోలు పోర్టబుల్ స్మార్ట్ కంప్యూటింగ్‌ను అన్ని వర్గాల వారికి చేరువచేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో రూపుదిద్దుకున్నఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ల వివరాలను గిజ్‌బాట్ పాఠకుల కోసం అందిస్తున్నాం.......

నిన్నటి వరకు పోర్టబుల్ కంప్యూటింగ్‌కే మాత్రమే ఉపకరించిన ట్యాబ్లెట్ కంప్యూటర్లు ఇప్పుడు ఆల్ - ఇన్- వన్ ఫీచర్లతో మొబైల్ కాలింగ్‌కు దోహదపడుతున్నాయి. 3జీ మొబైల్ సిమ్ స్లాట్‌తో కూడిన ట్యాబ్లెట్ పీసీలు మార్కెట్లోకి వచ్చాయి. వీటి ద్వారా ఏకకాలంలో మొబైలింగ్, కంప్యూటింగ్ ఇంకా ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ - 5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 8:

3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై సపోర్ట్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.7,290.

 

టాప్ - 5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

లావా ఈ ట్యాబ్ జడ్7హెచ్:

4జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
3జీ వయా డాంగిల్,
7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,
2800ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.5,499.

 

టాప్ - 5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

స్వైప్ 3డీ లైఫ్ ట్యాబ్ ఎక్స్74 3డీ:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ ఆల్వినర్ బాక్స్ ఇంకా ఏ13 ప్రాసెసర్ చిప్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,999.

 

టాప్ - 5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

మిలాగ్రో ట్యాబ్ టాప్ ఎంజీపీటీవో2 - 8జీబి:

1.2గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
512ఎంబి డీడీఆర్3 ర్యామ్,
బరువు 275 గ్రాములు,
0.3 మెగా పిక్స్ ఫ్రంట్ కెమెరా,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4 కలర్ ఆప్షన్‌లు,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ స్లాట్,
4000ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,
ధర రూ.8,990.

 

టాప్ - 5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

హెచ్‌సీఎల్ (ఎక్స్1) కె12:

ఆండ్రాయిడ్ 2.3.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,
ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1గిగాహెట్జ్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్ప్‌‍ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
మ్యాక్ 3500ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ,
ధర రూ.9,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot