స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్‌ల పై బెస్ట్ దివాళీ ఆఫర్స్!

Posted By: Super

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్‌ల పై బెస్ట్ దివాళీ ఆఫర్స్!

 

పండుగ మార్కెట్‌ను చేజిక్కించుకునే క్రమంలో స్మార్ట్‌ఫోన్ ఇంకా టాబ్లెట్ తయారీ సంస్థలు కొనుగోళ్ల పై ప్రత్యేక ఆఫర్లను కల్పిస్తున్నాయి. వాటిలో టాప్-5 బెస్ట్ డీల్స్ మీకోసం...

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్‌ల పై బెస్ట్ దివాళీ ఆఫర్స్!

నోకియా ఆషా స్మార్ట్‌ఫోన్స్(Nokia Asha Smartphones):

తమ ఆషా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోల పై నోకియా ప్రత్యేక ఆఫర్లను కల్పిస్తోంది. ప్రత్యేక రాయితీలలో భాగంగా... ఆషా 305, ఆషా 308 ఇంకా ఆషా 311 ఫోన్‌ల కొనుగోలు పై రూ.4500 విలువచేసే యాత్రా డాట్ కామ్ వారి ఉచిత ప్రయాణ వోచర్‌లను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్‌ల పై బెస్ట్ దివాళీ ఆఫర్స్!

నోకియా లూమియా స్మార్ట్ ఫోన్స్ (Nokia Lumia Smartphones):

నోకియా లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఆకర్షణీయమైన ఉపకరణాలను నోకియా ఇండియా ఆఫర్ చేస్తోంది. పండుగ ఆఫర్‌లో భాగంగా... నోకియా లూమియా 900 కొనుగోలు పై రూ.5,570విలువ చేసే నోకియా జే బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. మరో ఫోన్ లూమియా 610 కొనుగోలు పై రూ.1499విలువ చేసే ఫిలప్స్ హెడ్‌సెట్‌ను పొందవచ్చు. మరో ఫోన్ లూమియా 800 కొనుగోలు పై రూ.5,110 విలువ చేసే నోకియా ప్యూరిటీ హెడ్‌సెట్‌ను పొందవచ్చు. లూమియా 710 కొనుగోలు పై రూ.2,110 విలువ చేసే బీహెచ్-111 స్టీరియో హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్‌ల పై బెస్ట్ దివాళీ ఆఫర్స్!

కోబియన్ మెర్క్యురీ టాబ్లెట్స్ (Kobian Mercury Tablets):

కోబియన్ ప్రవేశపెట్టిన ప్రత్యేక పండుగ ఆఫర్‌లో భాగంగా మెర్క్యురీ టాబ్లెట్‌ల కొనుగోలు పై 4జీబి మైక్రోఎస్డీ కార్డ్‌లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్కీ డ్రా ద్వారా ఎల్‌సీడీ టీవీలను గెలుపొందే అవకాశం. నవంబర్ 1న ప్రారంభమైన ఈ ఆఫర్ నవంబర్ 25తో ముగుస్తుంది.

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్‌ల పై బెస్ట్ దివాళీ ఆఫర్స్!

హెచ్‌సీఎల్ టాబ్లెట్స్ (HCL Tablets):

పండుగ ఆఫర్‌లో భాగంగా హెచ్‌సీఎల్ తమ టాబ్లెట్‌ల కొనుగోలు పై రూ.1500విలువ చేసే ఫ్రీబ్యాగ్‌ను ఆఫర్ చేస్తోంది. వారం వారం ఏర్పాటు చేసే ప్రత్యేక డ్రాలో సిల్వర్ ఇంకా గోల్డ్ కాయిన్‌లతో పాటు కార్‌లను గెలుపొందే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్స్ (Samsung Galaxy Smartphones and Tablets):

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకని పలు గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు హోమ్‌షాప్18, ఇన్ఫీబీమ్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లు రూ.500 నుంచి రూ.1000వరకు ధరలను తగ్గించాయి. గెలాక్సీ ఎస్ డ్యుయోస్, గెలాక్సీ వై డ్యుయోస్, గెలాక్సీ వై, గెలాక్సీ వై డ్యుయోస్ ఫోన్ ల మోడళ్ల పై ఈ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. మరో వైపు గెలాక్సీ ట్యాబ్2 కొనుగోలు పై పలు ఆన్‌లైన్ స్టోర్‌లు రూ.1,000 నుంచి రూ.1500 వరకు ధరలను తగ్గించాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot