టాప్-5 ‘ఆపరేటింగ్ సిస్టంలు’

Posted By: Staff

 టాప్-5 ‘ఆపరేటింగ్ సిస్టంలు’

తక్కువ విద్యుత్‌ను ఖర్చుచెయ్యటంతో పాటు స్లిమ్ తత్వాన్ని ఒదిగి ఉండే కంప్యూటింగ్ నోట్‌బుక్‌లకు మార్కెట్లో విశేష ఆదరణ లభిస్తోంది. వీటి పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు యూజర్లు స్ర్కీన్‌తో పాటు ప్రాసెసర్‌లను మరింత అనుకూలంగా మలచుకోవచ్చు. ఈ శీర్షిక ద్వారా ఉత్తమ ఐదు నెట్‌బుక్ ఆపరేటింగ్ సిస్టంలకు సంబంధించిన సమాచారాన్ని గ్యాలరీ రూపంలో అందిస్తున్నాం...

జోలిక్లౌడ్:


 టాప్-5 ‘ఆపరేటింగ్ సిస్టంలు’


ఈ ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి నెట్‌బుక్‌ల కోసం డిజైన్ చేసారు. లైనెక్స్ ఆధారిత ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విండోస్ అప్లికేషన్‌లను సైతం సపోర్ట్ చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్ స్టాల్ చెయ్యటం వల్ల నెట్‌‌బుక్ మరింత మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

విండోస్ 7:


 టాప్-5 ‘ఆపరేటింగ్ సిస్టంలు’


మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఆ వోఎస్ 2009లో విడుదలైంది. ఈ వోఎస్ నెట్‌బుక్ బ్యాటరీ లైఫ్‌ను మరింత పెంచుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలోని ఆధునిక ఫీచర్లు ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్‌ను చేరువచేస్తాయి.

ఉబుంటు:


 టాప్-5 ‘ఆపరేటింగ్ సిస్టంలు’


ఈ లైనెక్స్ ఆధారిత వోఎస్‌ను నెట్‌బుక్‌లలో నిక్షిప్తం చెయ్యటం వల్ల యూజర్ సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను ఆస్వాదించవచ్చు.

మ్యాక్ వోఎస్ ఎక్స్:


 టాప్-5 ‘ఆపరేటింగ్ సిస్టంలు’


ఈ ఆపరేటింగ్ సిస్టం ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ విండోస్ ఇంకా లైనెక్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే కొంత కఠినతరంగా ఉంటుంది. అయితే ఈ వోఎస్ నుంచి మన్నికైన పనితీరును ఆశించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ నాన్-ఆపిల్ హార్డ్‌వేర్‌ను సపోర్ట్ చెయ్యదు.

లైనెక్స్ మింట్:


 టాప్-5 ‘ఆపరేటింగ్ సిస్టంలు’


ఈ వోఎస్ సౌలభ్యతతో  అందుబాటులో ఉన్నఅన్ని ఉబుంటు రిపోజిటరీలతో పాటు ఇతర సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను యాక్సిస్ చేసుకోవచ్చు.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot