Home
Computer

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో రోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే పరిమాణాన్ని కలిగి ఉంటున్న ట్యాబ్లెట్ కంప్యూటర్లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఇంకా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి ఉన్న ఉత్తమ 5 ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

Samsung Galaxy Tab S 10.5

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:.. 10.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్), ఆక్టాకోర్ ఎక్సినోస్ 5 (ఏ15 1.9గిగాహెట్జ్ + ఏ7 1.3 గిగాహెట్జ్) సీపీయూ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 4జీ, ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 7900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.45,000

 

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

Apple iPad Air

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ కీలక స్పెసిఫికేషన్‌లు.. ఐప్యాడ్ ఎయిర్ 7.5మిల్లీమీటర్ల మందం. బరువు 450 గ్రాములు మాత్రమే. అత్యాధునిక ఏ7 చిప్‌ను ఐప్యాడ్ ఎయిర్‌లో నిక్షిప్లం చేయటం జరిగింది. ఎమ్7 మోషన్ కోప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1080 పిక్సల్ ఫేస్‌టైమ్ కెమెరా, డ్యూయల్ మైక్‌ఫీచర్, 10 గంటల బ్యాటరీ లైఫ్, ఐప్యాడ్ ఎయిర్ సిల్వర్, వైట్, స్పేస్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరింయట్‌లలో పొందవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై ఇంకా సెల్యులార్ వర్షన్‌లలో అందుబాటులో ఉంది. ధర రూ.35,990 నుంచి ప్రారభం.

 

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

Sony Xperia Tablet Z2

సోనీ ఎక్స్ పీరియా టాబ్లెట్ జెడ్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను  పరిశీలించినట్లయితే... 10.1 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, లైవ్ కలర్ ఎల్ఈడి టెక్నాలజీతో, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీ + వై-ఫై మోడల్, ధర రూ.49,990.

 

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

Lenovo Yoga Tablet 10

 

10 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 800పిక్సల్స్), క్వాడ్ కోర్ 1.2గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ8389 (కార్టెక్స్-ఏ7) ప్రాసెసర్,
1జీబి ఎల్‌పీ‌ డీడీఆర్2 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింట్ నిర్వహించుకునేందుకు), 9000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. టాబ్లెట్ ధర రూ26,000

 

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో 5 టాబ్లెట్ పీసీలు!

Samsung Galaxy Tab 4 10.1

10.1 అంగుళాల WXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 6800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.28,000

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X