తోషిబా సరికొత్త టాబ్లెట్ పీసీ త్వరలో...!!!

Posted By: Staff

తోషిబా సరికొత్త టాబ్లెట్ పీసీ త్వరలో...!!!

సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ‘తోషిబా’, భారతీయ సాంకేతిక పరికరాల మార్కెట్లో దూసుకుపోతుంది. నూతన ఆవిష్కరణలతో ఈ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు ప్రారంభించింది. సరికొత్త ఆవిష్కరణకు సంబంధించి తోషిబా అధికారిక ప్రకటనను వెలువరించింది.

ఆధునిక సాంకేతిక వ్యవస్థతో రూపొందించిన ‘అల్ట్రా‌తిన్ AT700’ టాబ్లెట్ పీసీని తోషిబా, జపాన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్త జనరేషన్ వ్యవస్థలతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లను 2012 ప్రారంభానికి, ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో తోషిబా ఉంది.

యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో తయారైన ‘తోషిబా అల్ట్రా‌తిన్ AT700’ టాబ్లెట్ పీసీ బరువు కేవలం 558 గ్రాముల మాత్రమే. 0.3 అంగుళాల మందపు ధారుడ్యంతో డిజైన్ చేయబడిన ఈ గ్యాడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 10.1 అంగుళాల స్క్రీన్ 1280*800 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ టాబ్లెట్‌లో లోడ్ చేశారు. 1.2GHz డ్యూయల్ కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరును వినియోగదారుడికి అందిస్తుంది. 32జీబీ ఇంటర్నల్ మెమరీ వ్యవస్థ స్టోరేజి అంశాల్లో మరింత లబ్ధి చేకూరుస్తుంది.

5 మెగా పిక్సల్ రేర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను టాబ్లెట్ పీసీలో అమర్చారు. కనెక్టువిటీ అంశాలైన బ్లూటూత్, వై-ఫైలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. జీపీఎస్ కనెక్టువిటీతో పాటు ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ ఆప్లికేషన్లను గ్యాడ్జెట్లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ 9 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ధర ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలను తోషిబా త్వరలో ప్రకటించనుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting