‘తోషిభా AT200’.., మిమ్మల్ని టెక్నాలజీలో ముంచిలేపుతుంది..!!

Posted By: Super

‘తోషిభా AT200’.., మిమ్మల్ని టెక్నాలజీలో ముంచిలేపుతుంది..!!

ప్రస్తుతం పోటీ ప్రపచంలో ఆధునిక సాంకేతికను వినియోగదారులకు చేసేందుకు ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీ దారు ‘తోషిబా’ తమ తాజా ప్రకటనతో ప్రపంచ వ్యాపార వర్గాలను ఆశ్చర్చచకితులను చేసింది. తాజాగా బెర్లిన్ లో జరిగిన ఓ కాన్ఫిరెన్స్‌లో ‘తోషిబా AT200’ పేరుతో శక్తివంతంమైన టాబ్లెట్ పీసీని త్వరలో విడుదల చేయునున్నట్లు తోషిబా అధికార ప్రతినిధులు వెల్లడించారు.

భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ పీసీ పనిచేస్తుంది. పొందుపరిచిన TI OMAP 4430 1.2GHz ప్రొసెసర్, 1జబీ ర్యామ్ లు సమర్థమైన పనితీరును కలిగి ఉంటాయి. 10.1 అంగుళాల డిస్‌ప్లే మల్టీ టచ్ కంట్రోల్ వ్యవస్ధ ఆధారితంగా పనిచేస్తుంది. 5మోగా పిక్సల్ ఫ్రంట్ ఫ్లాష్ కెమెరా నాణ్యమైన విడీయో రికార్డింగ్ లను అందిస్తుంది. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా అద్భుతమైన వీడియో కాన్ఫిరెన్సింగ్ అనుభూతిని మీకు కల్పిస్తుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలకు పెద్దపీట వేస్తూ తోషిబా శక్తివంతమైన ఆడియో, వీడియో ఫ్లేయర్లను టాబ్లెట్‌‌లో ఏర్పాటు చేసింది. ఈ ప్లేయర్లు అద్భుతమైన ఫ్లే బ్యాక్ సామర్ధ్యం కలిగి ఉంటాయి. యూ - ట్యూబ్ ప్లేయర్లతో పాటు ఫ్లాష్ మీడియా సపోర్ట్ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గైరోమీటర్, యాక్సిలరోమీటర్, కంపాస్ వంటి ఫీచర్లు అదనం.

మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా జీబిని 64కు వృద్ధి చేసుకోవచ్చు. అనుసంధానించిన హెటీఎమ్ఎల్ వ్యవస్థ ఇంటెర్నట్ సర్ఫింగ్‌ను వేగవంతం చేస్తుంది. A2DP బ్లూటూత్ వ్యవస్థ, 802.11 b/g/n Wi-Fi వ్యవస్థులు అత్యంత వేగవంతంగా డేటాను ట్రాన్సఫర్ చేస్తాయి. హెచ్ డీఎమ్ ఐ పోర్టు ద్వారా టాబ్లెట్ పీసీని హెడ్డీ టీవీకి అనుసంధానం చేసుకోవచ్చు. ఆధునిక హంగులతో విడుదల కాబోతున్న ఈ ‘తోషిభా AT200’ ఇండియన్ మార్కెట్లో రూ .26000 ఉండోచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot