తోషిబా ‘క్రిస్టమస్’ మర్మం ఏంటి..?

Posted By: Staff

తోషిబా ‘క్రిస్టమస్’ మర్మం ఏంటి..?

సాంకేతిక ప్రేమికులను ఆశ్చర్యచికితులను చేయటంలో మందుండే ‘తోషిబా’, వినియోగదారులకు ‘క్రిస్టమస్’ కానుకుగా ఓ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తోషిబా సరికొత్త సిరీస్ ‘ల్యాప్‌టాప్‌లతో పాటు నెట్‌బుక్’ పరికరాలను సమంజసమైన ధరలకే అందించనుంది. తోషిబా శాటిలైట్ సిరీస్‌లో విడుదలవుతున్న C600, L700, L735D, P700 పరికరాలు 13.3 అంగుళాల నుంచి 17.3 స్క్రీన్ రేంజ్ కలిగి ఉంటాయి.

శాటిలైట్ C600 సిరీస్‌లో విడుదలయ్యే ల్యాపీ పరికరాలు ధరల రూ.17164 నుంచి మొదలవుతాయి. వివిధ వేరియంట్లలో లభ్యమయ్యే C600 సిరీస్ ల్యాపీల స్ర్కీన్ సైజులు 15.6 అంగుళాల నుంచి 17.3 అంగుళాల మధ్య ఉంటాయి.

ఉన్నత ప్రమాణాలతో తీర్చదిద్దబడిన తోషిబా శాటిలైట్ సిరీస్ ల్యాపీ పరికరాలు వినియోగదారులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుస్తాయి. ఏఎమ్‌డీ, ఇంటెల్ చిప్ వంటి ఆధునిక చిప్ వ్యవస్ధలను ల్యాపీల్లో అప్ గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది.

పెంటియమ్, కోర్ i3 శ్యాండీ బ్రిడ్జ్ ప్రొసెసర్లు శక్తివంతమైన పనితీరును కలిగి ఉంటాయి. 640 జీబీ హార్డ్ డ్రైవ్ వ్యవస్థ, 4GB DDR3 మెమరీ సామర్ధ్యం, ఆధునిక 2.0 వర్షన్ యూఎస్బీ పోర్టులతో పాటు డీవీడీ మల్టీ సూపర్ డ్రైవ్ వ్యవస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

L700’ సిరీస్‌లో తోషిబా విడుదల చేయుబోతున్న ల్యాపీలు విద్యార్థులతో పాటు ప్రొఫెషనల్స్‌కు మరింత ఉపయుక్తమైన కంప్యూటింగ్ వ్యవస్థను అందిస్తాయి. క్లాస్ రేంజ్‌ను కోరుకునే వారికోసం రూపుదిద్దుకున్న ‘L635D’ ల్యాపీలు క్లాసీ లుక్‌ను కలిగి ఉంటాయి.

‘శాటిలైట్ P700’ సిరీస్‌లో రూపుదిద్దుకుంటున్న ల్యాపీ పరికరాల్లో యాక్టివ్ ఇంటెల్ వైర్‌లెస్ డిస్‌ప్లే వ్యవస్ధను ఏర్పాటు చేయునున్నారు. ఈ సిరీస్ ల్యాపీ ధరలు రూ.30,983 నుంచి ప్రారంభమవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot