తక్కువ ధరలో మన్నిక, సరికొత్త ‘తోషిబా C660’తో..!!

Posted By: Super

తక్కువ ధరలో మన్నిక, సరికొత్త ‘తోషిబా C660’తో..!!

క్రికెట్ పండితుడు ‘సచిన్’,సాంకేతిక పరికరాల తయారీదారు ‘తోషిబా’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కట్టింగ్ ఎడ్జ్ వ్యవస్థతో, వినూత్న ల్యాపీ పరికరాలను డిజైన్ చేస్తున్న ఈ దిగ్గజ బ్రాండ్ కొత్త తరం సాంకేతికతను వినియోగదారులకు చేరువ చేస్తుంది. సంస్థ తాజాగా విడుదల చేసిన ‘తోషిబా C660’ ల్యాపీ ఆడ్వాన్సడ్ వర్షన్ లో రూపుదిద్దుకుంది. కేవలం రూ. 20,000లకే మార్కెట్లో లభ్యమవుతున్న ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు క్లుప్తంగా...

గ్యాడ్జెట్ లో ఏర్పాటు చేసిన డ్యూయల్ కోర్ ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసింగ్ వ్యవస్థ సమర్థవంతమైన పనితీరు కలిగి ఉంటుంది. అమర్చని 3జీబీ ర్యామ్ ప్రాసెసింగ్ లావాదేవీలను వేగవంతంగా స్పందింపచేస్తుంది. 1,366 x 768 పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యంతో ఈ గ్యాడ్జెట్ డిస్ ప్లే రూపుదిద్దుకుంది. ఈ ల్యాపీ ద్వారా అద్భుతమైన గ్యేమింగ్ అనుభూతిని ఆస్వాదించవచ్చు. అంతరాయంలేని ఆడియో, వీడియో అనుభూతులను శ్రోత పొందవచ్చు.


డీవీడీ రైటర్, వీజీఏ అవుట్ పుట్ అంశాలను ల్యాపీలో పొందుపరిచారు. ఎక్సటర్నల్ డివైజులను జత చేసుకునే విధంగా యూఎస్బీ పోర్టులను ల్యాపీలో ఏర్పాటు చేశారు
స్వల్ప వ్యవధిలోనే రీఛార్జ్ అయ్యే బ్యాటరీ వ్యవస్థ 4 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ బరువుతో డిజైన్ కాబడ్డ ఈ పరికరాన్ని ప్రయాణ సందర్భాల్లోనూ
సులువుగా ఉపయోగించుకోవచ్చు.

అధిక సంఖ్యలో సినిమాలతో పాటు పాటలు ఇతర వీడియోలను ల్యాపీ మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో మన్నికైన ల్యాపీని కోరుకునే వారికి ‘తోషిబా C660’సరైన జోడి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot