మాస్టర్ మెచ్చిన బ్రాండ్ నుంచి!

By Prashanth
|
Toshiba Excite 7.7


సచిన్ టెండుల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తోషిబా సరికొత్త శ్రేణిలో యూజర్ ఫ్రెండ్లీ టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. పేరు తోషిబా ఎక్సైట్ 7.7, ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లు ఉత్తమ పనితీరును కనబరుస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎక్సైట్ 7.7 ఫీచర్లు:

7.7 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్, యూఎల్‌పీ జీఫోర్స్ 2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎన్-విడియా టెగ్రా 3 చిప్‌సెట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, ర్యామ్ 1జీబి, ఇంటర్నల్ స్టోరేజ్ (16,32జీబి), మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, జీపీఆర్ఎస్ సపోర్ట్, ఎడ్జ్, వై-ఫై కనెక్టువిటీ, 3జీ, బ్లూటూత్, యూఎస్బీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, హెచ్‌టిఎమ్ఎల్ 5, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), మల్టీ మీడియా ( ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, స్పీకర్స్, ఆడియో జాక్), స్టాండర్ట్ లయోన్ బ్యాటరీ (స్టాండ్ బై 7 రోజులు), టాక్‌టైమ్ (460 గంటలు), ధర రూ.30,000.

పనితీరు:

2జీ, 3జీ ఫీచర్లను ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. పీసీలో నిక్షిప్తం చేసిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్ అదేవిధంగా ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంలు మన్నికైన పనితీరును కలిగి ఉంటాయి. పొందుపరిచిన కెమెరాలు ఉత్తమ క్వాలిటీ పోటోగ్రఫీనిస్తుంది. వెడల్పాటి డిస్‌ప్లే స్ర్కీన్ మన్నికైన విజువల్ అనుభూతిని చేరువచేస్తుంది. స్ర్కీన్ పై ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ కవచంలో నిలుస్తంది. పొందుపరిచిన ఎస్ఆర్ఎస్ సౌండ్ వ్యవస్థ ఉత్తమమైన ఆడియో అనుభూతులను చేరువచేస్తుంది. డాక్యుమెంట్ వ్యూవర్, ఫోటో ఎడిటర్, వాయిస్ మెమో వంటి అంశాలను టాబ్లెట్‌లో నిక్షిప్తం చేశారు. జూన్ నాటికి ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది. ధర రూ.30,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X