ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్న తోషిబా..?

Posted By: Staff

ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్న తోషిబా..?

 

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు తోషిబా శక్తివంతమైన ప్రాసెసర్‌తో కూడిన ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను వృద్థి చేసే పనిలో నిమగ్నమైనట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. ఈ దిగ్గజ బ్రాండ్ ఇటీవల విడుదల చేసిన టాబ్లెట్ పీసీ ‘తోషిబా త్రైవ్’ ఆండ్రాయిడ్ హనీకూంబ్ వోఎస్ పై రన్ అవుతున్న విషయం తెలిసిందే.

తోషిబా తాజాగా వృద్థి చేస్తున్న ఈ టాబ్లెట్‌లో శక్తివంతమైన టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను బలపరిచినట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ క్లాక్ వేగం 1400 MHzగా ఉండటంతో టాస్కింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతుంది. ఆండ్రాయిడ్ v3.2 హనీకూంబ్ లేదా ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ v4.0 ఆపరేటింగ్ సిస్టంను డివైజ్‌లో లోడ్ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఫీచర్లు,  స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలను తోషిబా అత్యంత గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. లాస్‌వేగాస్‌లో ఈ జనవరిలో నిర్వహించే ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’లో తోషిబా ఈ టాబ్లెట్ నమూనాను ప్రదర్శించనుందని విశ్లేషక వర్గాలు పేర్కొంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot