28,132కే ‘తోషిబా’ బంపర్ జాక్‌పాట్ కొట్టేయండి..!!

Posted By: Staff

28,132కే ‘తోషిబా’ బంపర్ జాక్‌పాట్ కొట్టేయండి..!!

‘‘దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు తోషిబా ప్రేవేశపెట్టిన సరికొత్త ‘రూబీ రెడ్ ల్యాప్‌టాప్’ పరికరం వినియోగదారుడికి సరసమైన బడ్జెట్లో సమగ్రమైన పనితీరును అందిస్తుంది. ‘తోషిబా శాటిలైట్ L755D’ పేరుతో విడుదలైన ఈ ల్యాపీ పటిష్టమైన కంప్యూటింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఏ.ఎమ్.డి (AMD’s) లయానో ఆర్కిటెక్చర్ వ్యవస్థతో స్టైలిష్‌గా తీర్చదిద్దబడిన ఈ గ్యాడ్జెట్ శక్తివంతమైన ఫీచర్లతో మన్నికైన పని వ్యవస్థను కలిగి ఉంటుంది. త్వరలో భారతీయ మార్కెట్లో విడదుల కాబోతున్నఈ స్మార్ట్ ల్యాపీని రూ. 28132కే సొంతం చేసుకోవచ్చు.’’

క్లుప్తంగా ‘తోషిబా L755D’ ఫీచర్లు:

- 15.6 అంగుళాల డిస్‌ప్లే శక్తివంతమైన 1366 X 768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. పొందుపరిచిన ఏ.ఎమ్.డి (AMD) రేడియన్ హెచ్డీ గ్రాఫిక్ వ్యవస్థ చూడదగ్గ విజువల్ అనుభూతిని వినియోగదారుడికి అందిస్తుంది.

- ఏర్పాటు చేసిన ఇంటెల్ కోర్ i3 ప్రొసెసింగ్ వ్యవస్థ ల్యాపీ పని తీరును ఎప్పిటికప్పుడు సమీక్షిస్తుంది.

- (L755D, 6 GB) సామర్ధ్యం కలిగిన ర్యామ్, 320 జీబీ హార్డ్ డిస్క్, 2.3 GHz ఏ.ఎమ్.డి టర్బో తదితర వ్యవస్థలు వినియోగదారుని పనిని మరింత సులువు చేస్తాయి.

- ల్యాపిలో అనుసంధానించిన ఇంటర్నెట్ తదితర బ్రౌజింగ్ వ్యవస్థలు వేగవంతమైన పనితీరును కలిగి ఉంటాయి.

- పూర్తి భరోసాతో రూపొందించబడిన ఈ ల్యాపీ పై సంవత్సర కాలం వారంటీని వినియోగదారుడు పొందవచ్చు.

- ల్యాపీలో పొందుపరిచిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ అంశాలు ఇతర ల్యాపీలకు ధీటుగా మన్నికైన వ్యవస్థను కలిగి ఉంటాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot