తోషిబా నుంచి 18 కొత్త ల్యాప్‌టాప్‌లు

జపాన్ టెక్ దిగ్జగం తోషిబా.. విద్యార్థి, ఉద్యోగ ఇంకా వ్యాపార వర్గాలను టార్గెట్ చేస్తూ తన శాటీలైట్ సిరీస్ నుంచి 18 కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఉత్తమ క్వాలిటీ స్పీకర్ వ్యవస్థ, హెచ్‌డిఎమ్ఐ 4కే అవుట్‌పుట్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్ శ్రేణి ధరలు రూ.21,736 నుంచి రూ.76,600 వరకు ఉన్నాయి.
వినియోగదారులకు నాణ్యతతో కూడిన ల్యాప్‌టాప్‌లను అందిచేందుకు తమ కృషి కొనసాగుతుందని తోషిబా ఇండియా కంట్రీ హెడ్ డీఎస్ డివిజన్ సంజయ్ వార్కే అన్నారు. తమ శాటిలైట్ సిరీస్ నుంచి విడుదలైన ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు తేలికగా ఇంకా హైక్వాలిటీ మన్నిక డిజైన్‌ను కలిగి ఉంటాయని తోషిబా ఇండియా పీసీ విభాగం డీఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ మార్కెటింగ్) శివకుమార్ తెలిపారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








