ఇండస్ట్ర్రీ పై త్రిమూర్తుల కన్ను..?

Posted By: Super

 ఇండస్ట్ర్రీ పై  త్రిమూర్తుల కన్ను..?

 

క్వాలిటీ బ్రాండ్ తోషిబా మూడు విభిన్న కోణాల్లో టాబ్లెట్ పీసీలను డిజైన్ చేసింది. ఎక్సైట్ సిరీస్ నుంచి వస్తున్న ఈ త్రయం భిన్న స్ర్కీన్ సైజుల్లో రూపుదిద్దుకున్నాయి. వీటి వివరాలు

తోషిబా ఎక్సైట్ 13,

తోషిబా ఎక్సైట్ 10,

తోషిబా ఎక్సైట్ 7.7,

వీటిలో మొదటిదైన తోషిబా ఎక్సైట్ 13 కీలక ఫీచర్లు:

1జీబి ర్యామ్,

1.5 గిగాహెడ్జ్ ఎన్- విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

స్టోరేజ్ సామర్ధ్యం 32 GB / 64 GB,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

13 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1600 by 900 పిక్సల్స్).

డెస్క్‌టాప్ మోడల్‌ను తలపించే ఈ టాబ్లెట్ పెద్దదైన  డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బ్రౌజింగ్, గేమింగ్ అదేవిధంగా వీడియోలను తిలకిస్తున్న సందర్భాలలో మెరుగైన అనుభూతికి యూజర్‌ను లోను చేస్తుంది. జూన్ నాటికి ఈ అందుబాటులోకి రానున్న ఈ టాబ్లెట్ రెండు వేరియంట్‌లలో లభించనుంది. మొదటి మోడల్ 64జీబి ధర రూ.38,000, రెండవ వేరియంట్ 32 జీబి ధర రూ.33,000.

తోషిబా ఎక్సైట్ 10 కీలక ఫీచర్లు:

10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 by 800 పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్,

మెమరీ స్టోరేజ్ సామర్ధ్యం 16 GB / 32 GB / 64 GB,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

బ్యాటరీ స్టాండ్ బై 12 గంటలు.

మే నాటికి ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది. మూడు వేరియంట్‌లలో ఈ పీసీలు లభ్యం కానున్నాయి. 16జీబి ధర రూ.23,000, 32జీబి ధర రూ.27,000, 64జీబి రూ.33,000.

తోషిబా ఎక్సైట్ 7.7 ప్రధాన ఫీచర్లు:

7.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆమోల్డ్ టెక్నాలజీ,

టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్,

5 మెగా పిక్పల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమరీ స్టోరేజ్ సామర్ధ్యం 16 GB / 32 GB.

తోషిబా సిరీస్‌లో ఆమోల్డ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న తొలి డివైజ్ ఎక్సైట్ 7.7, జూన్ నాటికి ఈ టాబ్లెట్ మార్కెట్లో లభ్యం కానుంది. ధర అంశాలను పరశీలిస్తే 16జీబి మోడల్ ధర రూ.25,000,  32 జీబి మోడల్ ధర రూ.29,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot