తోషిబా సరికొత్త ఆవిష్కరణ ‘క్వాస్మియో X770’..!!

Posted By: Super

తోషిబా సరికొత్త ఆవిష్కరణ ‘క్వాస్మియో X770’..!!

‘సచిన్’ డబుల్ సెంచురీని బీట్ చేయ్యాలని కుతూహలంగా ఉన్నారా.., ‘బోల్ట్’ రన్నింగ్ రికార్డును బద్దలు కొట్టాలని ఉందా.., హ్యారిపోర్టర్ రేంజ్ లో అద్భుత విన్యాసాలు మీ సొంతమవ్వాలంటే తోషిబా సరికొత్త గ్యేమింగ్ ల్యాపీలో ఒక గ్యేమ్ ఆడాల్సిందే. ఈ గ్యేమింగ్ ల్యాపీతో ప్రతి క్షణం ఉత్కంఠభరితమే, ఒళ్లు గగుర్పాటుకు లోనైన అనుభూతి మీ సొంతమే.

అత్యాధునిక గ్యేమింగ్ వ్యవస్థతో ‘తోషిబా’ రూపొందించిన ‘తోషిబా క్వాస్మియో X770’ గ్యేమింగ్ 3డీ షట్టర్ గ్లాసులతో లభ్యమవుతుంది. ఈ గ్లాసులను ధరించి గ్యేమింగ్ లో పాల్గొనటం వల్ల వాస్తవ అనుభూతలకు మీరు లోనవుతారు. ఈ ల్యాపీ ఫీచర్లను పరిశీలిస్తే ‘న్విడియా ఆడ్వాన్సడ్ గ్రాఫిక్ టెక్నాలజీ’ గ్యేమింగ్ ఆసక్తిని మరింత పెంచుతుంది.

17.3 అంగుళాల ల్యాపీ హై డెఫినిషన్ డిస్ ప్లే మీ కళ్లను కట్టిపడేస్తుంది. ల్యాపీలో ఏర్పాటు చేసిన సాలిడ్ స్టేట్ 4జీ హైబ్రిడ్ డ్రైవ్ వ్యవస్థ బూటింగ్ వేగాన్ని మరింత పెంచుతుంది. 4జీబీ, 6జీబీ, 8జీబీ వేరియంట్లలలో ఈ ల్యాపీలు లభ్యమవుతున్నాయి.

ల్యాపీలో పొందుపరిచిన 3డీ ఫీచర్లతో, గ్యేమ్ లను మూడు డైమెన్షినల్ విధానాలలో తిలకించవచ్చు. పొందుపరిచిన 3డీ వెబ్ కెమెరా, 3డీ వీడియో కాన్ఫిరెన్సింగ్ కు దోహదపడుతుంది. నాణ్యమైన ఆడియో వ్యవస్థను కలిగి ఉంటే హార్మన్, కార్డన్ స్టీరియో స్పీకర్ వ్యవస్థను ల్యాపీలో ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన కీబోర్డు వ్యవస్థలో టచ్ కంట్రోల్ బటన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మెరుగైన గ్యేమింగ్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ల్యాపీ ధర రూ. 75,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot