విపణిలోకి తోషిబా అల్ట్రా హైడెఫినిషన్ ల్యాప్‌టాప్

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ తొషిబా ప్రపంచపు మొట్టమొదటి అల్ట్రా హైడెఫినిషన్ (4కే) ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. శాటిలైట్ ‘పీ' సిరీస్ నుంచి విడుదలైన ఈ పీ50టీ - బీ వై3110 (P50t-B Y3110) ల్యాపీ 4కే రిసుల్యూషన్ క్వాలిటీ వీడియోలను సపోర్ట్ చేస్తుంది. ధర రూ.86,000. జూన్ నెలాఖరు నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఆధునిక వర్షన్ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌కు సంబంధించి స్పెసఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

 విపణిలోకి తోషిబా అల్ట్రా హైడెఫినిషన్ ల్యాప్‌టాప్

15.6 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 3840x2160పిక్సల్స్), 1 టాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్, 2.5గిగాహెట్జ్ 4వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ర్యామ్ (16జీబి వరకు విస్తరించుకునే అవకాశం), 2జీబి ఏఎమ్‌డి గ్రాఫిక్ కార్డ్, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ, వై-ఫై, యూహెచ్ఎస్ II ఎస్డీ కార్డ్‌స్లాట్, హెచ్‌డిడి ప్రొటెక్షన్ సెన్సార్స్, హర్మాన్, కార్డాన్ స్పీకర్ వ్యవస్థ, యూఎస్బీ స్లీప్ అండ్ చార్జ్ పోర్ట్, ఫ్రేమ్‌లెస్ బ్యాక్‌లైట్ కీబోర్డ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot