ఒప్పందం వెనుక రహస్యం!!

Posted By: Super

ఒప్పందం వెనుక రహస్యం!!

 

కంప్యూటర్ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ తోషిబా తాజాగా మరో దిగ్గజ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. తాము రూపొందిస్తున్న ల్యాప్‌టాప్‌లను సాంకేతికంగా మరింత బలపరిచే క్రమంలో ‘ఐబీఎమ్’తో జోడి కట్టినట్లు తెలిసింది. ఈ ఒప్పందానికి గల ప్రధాన కారణాలను పరిశీలిస్తే... ఆడ్వాన్సుడ్ సెక్యూరిటీ ప్రొటక్షన్ మరియు మెరుగైన బ్యాటరీ బ్యాకప్.

ఐబీఎమ్ రూపొందించిన ప్రత్యేక వ్యవస్థతో నిర్మితమైన ల్యాపీలను 2012 జూన్ - జూలై నాటికి అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో కంప్యూటర్ల వినియోగం మరింత విస్తరిస్తున్న నేపధ్యంలో తోషిబా ఈ మేరకు ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తోషిబా ఆడ్వాన్సుడ్ ‘BIOS’ అదేవిధంగా ఐబీఎమ్ ‘Tivoli Endpoint Manager’ వంటి ప్రత్యేక వ్యవస్థలతో ఈ ల్యాపీలు పని చేస్తాయి. వీటి సౌలభ్యతతో ల్యాపీ బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవటంతో, పర్సనల్ డేటాను మరిత భద్రపరుచుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot