‘స్లిమ్’గా వస్తున్న ‘తోషిబా’...!!

Posted By: Staff

‘స్లిమ్’గా వస్తున్న ‘తోషిబా’...!!

దశాబ్ధాల కాలంగా వినియోగదారులకు నాణ్యమైన సాకేంతిక పరికరాలను అందించటంలో సఫలీకృతమైన ‘తోషిబా’ తేలికపాటి టేబ్లెట్ పీసీలను మార్కట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ పీసీకి సంబంధంచి ఒక్క బరువు విషయంలోనే కాకుండా, మెరుగైన డిజిటల్ వ్యవస్థతో పాటు మన్నికైన మెటాలిక్ డిజైన్ ను పొందుపరచటంలో సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అత్యాధునిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ పరికరం త్వరలో విడుదల కానుంది. పొందుపరిచిన యూఎస్బీ పోర్టు తదితర అంశాలను వినియోగాదారునుకి లబ్ధిని చేకూరుస్తాయి. హనీ కూంబ్ ఆండ్రాయిడ్ ఆపరేటిండ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లో సామర్ధ్యం కలిగిన న్విడియా టెగ్రా 2 చిప్ సెట్ ప్రొసెసర్ ను పొందుపరిచారు. ఏర్పాటు చేసిన మల్లీ టచ్ వ్యవస్థ వీడియో వాచింగ్, గేమింగ్ సమయాల్లో మరింత ఉపయోగపడుతుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే, 2 అత్యాధునిక పిక్సల్ సామర్ధ్యం గల కెమెరాలను ఈ పీసీలో పొందుపరచవచ్చని తెలుస్తోంది.

విడుదుల కాబోతున్న ‘తోషిబా’ టాబ్లెట్ పీసీ ఫీచర్లకు సంబంధించి అధికారికంగా ఎటువంటి విషయాలు తెలియనప్పటికి, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సోషల నెట్ వర్కింగ్ తదితర అంశాలకు సంబంధించి ఆప్లికేషన్లను ముందుగానే లోడ్ చేసినట్లు తెలుస్తోంది. 10.1 అంగుళాల స్క్రీన్ సైజు కలిగిన ఈ టాబ్లెట్ పీసీకి పొందుపరిచిన 2 డైనమిక్ స్పీకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

తోషిబా ఎంచుకున్న బ్లూటూత్, యూఎస్బీ, వై-ఫై వ్యవస్థలు అత్యధిక వేగంతో డేటాను ట్రాన్స్ ఫర్ చేస్తాయి. మన్నికైన బ్యాటరీ వ్యవస్థ వినియోగదారునికి దీర్ఘకాలిక పనితీరును అందిస్తుంది. లయోన్ బ్యాటరీ వ్యవస్థను ఈ టాబ్లెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అత్యాధునిక హంగులతో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ పీసీ ఇండియన్ మార్కెట్లో రూ. 19500 ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot