దిగ్గజాల మద్య యుద్ధం మొదలైంది..!!

Posted By: Staff

దిగ్గజాల మద్య యుద్ధం మొదలైంది..!!

సాంకేతిక దిగ్గజాలైన తోషిబా, లెనోవోల మధ్య ఈ ఏడాది యుద్ధం మొదలు కాబోతుంది. ప్రతిష్టాత్మకంగా ఈ రెండు దిగ్గజ బ్రాండ్లు తోషిబా ‘పోర్టిగీ Z830’, లెనోవో ‘ఐడియా ప్యాడ్ U300S’ పేర్లతో అల్ట్రాబుక్ ల్యాపీలను మార్కెట్లో విడుదల చేయునున్నాయి. ఇప్పటికి లెనోవో యూ సరీస్ పరికరాలకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో తోషిబా, లెనోవోను ఎదుర్కోవటం కష్టతరమే..?, ఏదేమైన విడుదల కాబోతున్న ఈ రెండు పరికరాల్లో ఏది మన్నికైనదో నిర్థారించాల్సింది అంతిమంగా వినియోగదారులే.

ల్యాప్‌టాప్‌ల ఆకృతిలో ఉండే అల్ట్రా‌బుక్ పరికరాలు తక్కువ పరిమాణం కలిగి ఉండటంతో పాటు అతి తక్కువ బరువును కలిగి ఉంటాయి. సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే మరింత వేగవంతంగా పని చేస్తాయి. అల్ట్రా లో వోల్టేజి కోర్ i3/i7 ప్రొసెసింగ్ వ్యవస్థలను ఈ పరికరాల్లో పొందుపరుస్తారు. ఈ పరికారల స్లిమ్‌నెస్ విషయానికొస్తే ‘లెనోవో U300s’ 13.3 అంగుళాల స్క్రీన్ పరిమాణం కలిగి నాజూకుగా దర్శనమిస్తుంది. తోషిబా ‘పోర్టిగీ Z830’ విషయానికొస్తే 13.3 అంగుళాల పరిమాణంలో రెండు వేరియంట్లు మీకు లభ్యమవుతాయి. ఒక మోడల్ సాధారణ వినియోగదారుడితో, మరో మోడల్ వ్యాపరవేత్తకు సూరితూగే విధంగా వీటిని రూపొందించారు. బరువు విషయానికొస్తే ‘Z830’ 2.45 పౌండ్లు, ‘U300s’ 2.91 పౌండ్ల బరువును కలిగి ఉంటాయి.

ప్రొసెసింగ్ అంశాలను పరిశీలిస్తే ‘తోషిబా Z830’ అల్ట్రా లో వోల్టేజి కోర్ i3 ప్రొససెర్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ‘లెనోవో U300s’లో అల్ట్రా లో వోల్టేజి కోర్ i7 ప్రొససెర్ వ్యవస్థను పొందుపరిచారు. సాలిడ్ స్టేట్ డ్రైవ్(SSD)లు ఈ రెండు అల్ట్రా‌బుక్‌లలో దర్శనమిస్తాయి వీటి స్ధాయిలను పరిశీలిస్తే లెనోవో 256GB SSD, తోషిబా128 GB SSD సామర్ధ్యం కలిగి ఉంటాయి.

బ్యాటరీ అంశాలను పరిశీలిస్తే ‘U300s’లో ఏర్పాటేచేసిన 4 సెల్ బ్యాటరీ 30 రోజుల స్టాండ్ బై మోడ్ సామర్ధ్యం కలిగి 8 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. తోషిబా బ్యాటరీ వ్యవస్థకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ల్యాపీలో 8 సెల్ ప్రిస్ మ్యాటిక్ బ్యాటరీ వ్యవస్థను పొందుపరచవచ్చని తెలుస్తోంది.

సౌండ్ నాణ్యత విషయంలో ‘తోషిబా’ మ్యాక్స్ ఆడియో , రిసల్యూషన్ ప్లస్ వంటి అత్యాధునిక వ్యవస్థలను కలిగి ఉంది. ‘లెనోవో’ విషయానికొస్తే ఉన్నత ప్రమాణాలతో రూపొందించబడిన ఎస్‌ఆర్‌ఎస్(SRS) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ రెండు పరికరాల్లో హెచ్‌డీ‌ఎమ్‌ఐ సమాన ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. త్వరలో విడుదల కాబోతున్న ఈ పరికరాల ధరలను పరిశీలిస్తే ఇండియన్ మార్కెట్లో ‘తోషిబా Z830’ $1000, ‘లెనోవో U300s’ $1200 ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot