తోషిబా డబుల్ ధమాకా!!

Posted By: Prashanth

తోషిబా డబుల్ ధమాకా!!

 

డబుల్ ధమాకాతో ‘తోషిబా’ మరోసారి పంజా విసరనుంది. గ్రాఫిక్.. గేమింగ్ విభాగాలను పటిష్టితం చేస్తూ ‘క్వాస్మియో F755 3D’ ల్యాప్ టాప్ ను తోషిబా అప్ డేట్ చేసింది. ఎన్-విడియా జీఫోర్స్ 3డీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఆధునిక వర్షన్ డివైజ్ లో నిక్షప్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సౌలభ్యతతో ‘3డి’ కంటెంట్ ఉత్కంఠైన అనుభూతితో ఆస్వాదించవచ్చు. ఈ అప్ డేటెడ్ వర్షన్ ల్యాప్ టాప్ ద్వారా 3డీ గేమ్స్ మరియు వీడియోలను కళ్లద్దాలు సాయం లేకండా తిలకించవచ్చు.

అప్ డేటెడ్ వర్షన్ ‘తోషిబా క్వాస్మియో F755 3D’ ల్యాప్ టాప్ ఫీచర్లు:

* 15.6 అంగుళాల డిస్ ప్లే,

* యాక్టివ్ లెన్స్,

* ఇంటెల్ i5,i7 ప్రాసెసర్ (వేరియంట్ ను బట్టి),

* 1జీబి డిడిఆర్3 మెమరీ,

* ర్యామ్ సామర్ధ్యం 8జీబి వరకు,

* 750జీబి స్టోరేజ్ స్పేస్,

* బ్లూరే డిస్క్,

* హెచ్డీఎమ్ఐ పోర్ట్,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత.

* ఐ ట్రాకింగ్ సాఫ్ట్ వేర్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot