‘ఎంపిక’ మీ చేతులో..?

Posted By: Super

‘ఎంపిక’ మీ చేతులో..?

ప్రజా తీర్పు కోసం సాంకేతిక దిగ్గజాలు ‘తోషిబా’, ‘లెనోవో’ ఎదురు చూస్తున్నాయి. సమాన ధరతో పాటు సమాన విలువలు కలిగిన రెండు ల్యాప్‌టాప్ లను, ఈ రెండు బ్రాండ్లు మార్కెట్లో విడుదల చేశాయి. ‘క్వసిమో F755’ పేరుతో తోషిబా 3డీ ల్యాపీ విడుదల చేస్తే, ‘థింక్ ప్యాడ్ X220’ పేరుతో లెనోవో అల్ట్రా పోర్టబుల్ ల్యాపీని విడుదల చేసింది. అన్ని విషయాల్లోనూ ‘నువ్వా - నేనా’ అన్న చంధంగా పోటి పడుతున్న ఈ పరికరాలు ఎంపిక విషయంలో వినియోగదారులకు విషమ పరీక్ష పెడుతున్నాయి.

ఈ గ్యాడ్జెట్లలోని ఫీచర్లను పరిశీలిస్తే..., ‘F755’లోని యాక్టివ్ లెన్స్ సాంకేతిక డిస్‌ప్లే వ్యవస్థ 2డీ, 3డీ కంటెంట్‌ను నాణ్యమైన గ్రాఫిక్ పరిమాణంలో మీ ముందుంచుతుంది. 1.4కిలోల బరవుతో రూపుదిద్దుకున్న ‘X220’ 12.5 అంగుళాల నాణ్యమైన డిస్‌ప్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ల్యాపీలో పొందుపరిచిన శక్తివంతమైన కోర్ i7 ప్రొసెసింగ్ వ్యవస్థ, 8జీబీ సామర్థ్యం గల ర్యామ్ వినియోగదారునికి మేలును చేకూర్చే విధంగా ఉంటాయి.

ఇక ‘F755’ విషయానికొస్తే పొందుపరిచిన 2GHz ఇంటెల్ కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థ, ఇంటెల్ HM65 చిప్‌సెట్, 1జీబీ GDDR3 మెమరీ సామర్ధ్యం గల న్విడియా జీ ఫోర్స్ GT540M గ్రాఫిక్ వ్యవస్థ, 6GB DDR3 SO-DIMM వ్యవస్థలు వినియోగదారునికి లబ్ధి చేకూర్చే విధంగా ఉంటాయి. ఎక్సటర్నల్ స్లిమ్ బ్యాటరీ వ్యవస్థ కలిగిన ‘థింక్ ప్యాడ్’ 23 గంటల నిరంతరాయ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. ‘తోషిబా’లో పొందుపరిచిన 3జీ సామర్ధ్యంతో పాటు ఫేస్ ట్రాకింగ్ వ్యవస్థతో ఏర్పాటుచేసిన 1.3 మెగా పిక్సల్ కెమెరా 720 పిక్సల్ సామర్ధ్యం కలిగిన వీడియో ప్లేబ్యాక్ కలిగి ఉంటుంది.

కెనెక్టువిటీ అంశానికొస్తే, అధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దకున్న డివైజ్‌లను ఈ సెట్లలో అనుసంధానించారు. సరికొత్త 802.11 b/g/n వ్యవస్థతో కూడిన వై - ఫై, 3.0 వర్షన్ బ్లూటూత్, 3.0 యూఎస్బీ పోర్టు వంటి ఆధునిక అంశాలను లెనోవోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చివరిగా వీటి ధరలను పరిశీలిస్తే, ఇండియన్ మార్కెట్లో ‘క్వసిమో F755’ ల్యాపీ ధర రూ.77,510, థింక్ ప్యాడ్ ధర రూ. 72,000 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot