కొత్త అనుభూతి!

Posted By: Super

కొత్త అనుభూతి!

 

దిగ్గజ బ్రాండ్ తోషిబా సరికొత్త ల్యాప్‌టాప్ మోడల్‌తో ముందుకొచ్చింది. ఈ బ్రాండ్ తాజాగా డిజైన్ చేసిన ల్యాపీ క్వాస్మియో టీ852 శక్తివంతమైన ఇంటెల్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. స్ర్కీన్ పరిమాణం 15.6 అంగుళాలు. ఈ ల్యాపీ విండోస్ 7 ఆధారితంగా పని చేస్తుంది. నిక్షిప్తం చేసిన కోర్ ఐ7 ప్రాసెసర్ 2.3గిగాహెడ్జ్ వేగంతో కూడిన ప్రాసెసింగ్ పనితీరును కలిగి ఉంటుంది. 8జీబి ర్యామ్ టాస్కింగ్‌ను మరింత సౌకర్యవంతం చేస్తుంది. 1 టాబ్ హార్డ్‌డ్రైవ్ ల్యాపీ మెమరీని పరిపుష్టం చేస్తుంది. బ్లూ‌రే డిస్క్, డీవీడీ, సీడీలను రీడ్ చేసే ఆప్టికల్ డ్రైవ్‌ను ల్యాపీలో లోడ్ చేశారు. ఏర్పాటు చేసిన వై-ఫై ల్యాపీ కనెక్టువిటీని మరింత బలోపేతం చేస్తుంది.

గేమింగ్ అవసరాలను సమృద్ధిగా తీర్చే ఈ ల్యాపీ ఉత్తమైన గ్రాఫిక్ వ్యవస్థలను ఒదిగి ఉంది. ఇందు కోసం ప్రత్యేకించి ఎన్-విడియా జీటీ 640ఎమ్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో అమర్చారు. ఏర్పాటు చేసిన హార్మన్ స్టీరియో స్పీకర్స్ ఉత్తమ క్వాలిటీ ఆడియో అనుభూతులను చేరువచేస్తాయి. హెచ్‌డిఎమ్ఐ కార్డ్‌స్లాట్ సాయంతో ల్యాపీని హై డెఫినిషన్ డివైజ్‌లకు జత చేసుకోవచ్చు. బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు తోడ్పడుతుంది. అదేవిధంగా ట్రాక్ ప్యాడ్ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ మే 25 నాటికి మార్కెట్లో లభ్యం కానుంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

తోషిబా Qosmio X870:

తోషిబా డిజైన్ చేసిన సరికొత్త ల్యాప్‌టాప్ Qosmio X870 వినియోగదారుడి అంచనాలకు రెట్టింపు భరోసానిస్తుంది. అధిక ముగింపు గల ఫీచర్లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ప్రత్యేకించి గేమింగ్ ప్రేమికుల కోసం తీర్చిదద్దబడిన ఈ గ్యాడ్జెట్ క్వాలిటితో కూడిని వినోదానికి‌లోను చేస్తుంది.

Qosmio X870 ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:

17.3 అంగుళాల ట్రూబ్రైట్ హై డెఫినిషన్ ఎల్‌ఈడి స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 3డి డిస్‌ప్లే, హై డెఫినిషన్ వెబ్ కెమెరా, ఎన్-విడియా గ్రాఫిక్ ప్రాసెసర్, 2జీబి ఇంటర్నల్ మెమరీ, హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, ఆప్టికల్ బ్లూ రే డీవీడీ డ్రైవ్, హార్మన్ కార్డన్ స్టీరియో స్పీకర్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot