మీ అంచనాలకు రెట్టింపు

Posted By: Prashanth

మీ అంచనాలకు రెట్టింపు

 

తోషిబా తాజాగా డిజైన్ చేసిన సరికొత్త ల్యాప్‌టాప్ Qosmio X870 వినియోగదారుడి అంచనాలకు రెట్టింపు భరోసానిస్తుంది. అధిక ముగింపు గల ఫీచర్లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ప్రత్యేకించి గేమింగ్ ప్రేమికుల కోసం తీర్చిదద్దబడిన ఈ గ్యాడ్జెట్ క్వాలిటితో కూడిని వినోదానికి‌లోను చేస్తుంది.

Qosmio X870 ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:

* 17.3 అంగుళాల ట్రూబ్రైట్ హై డెఫినిషన్ ఎల్‌ఈడి స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

* 3డి డిస్‌ప్లే,

* హై డెఫినిషన్ వెబ్ కెమెరా,

* ఎన్-విడియా గ్రాఫిక్ ప్రాసెసర్,

* 2జీబి ఇంటర్నల్ మెమరీ,

* హార్డ్ డిస్క్ డ్రైవ్,

* హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ,

* బ్లూటూత్ 4.0,

* వై-ఫై,

* ఆప్టికల్ బ్లూ రే డీవీడీ డ్రైవ్,

* హార్మన్ కార్డన్ స్టీరియో స్పీకర్స్.

వీనల విందైన అనుభూతుల సారాన్ని అంతిమంగా ఈ ల్యాపీ మీకందిస్తుంది. అత్యాధునిక సాంకేతిక విలువలతో కూడిన హై డెఫినిషన్, 3డి వ్యవస్థలను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చెయ్యటం వల్ల ఉత్తమ క్వాలిటీ డిస్‌ప్లేను మీరు పొందగలుగుతారు. ఏర్పాటు చేసిన ఎన్-విడియా గ్రాఫిక్ వ్యవస్థ ఉత్తమమైన పనితీరును కనబరుస్తుంది. ల్యాపీ ప్రాసెసర్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot