తోషిబా సరికొత్త ల్యాప్‌టాప్ Qosmio X870

తోషిబా డిజైన్ చేసిన సరికొత్త ల్యాప్‌టాప్ Qosmio X870 వినియోగదారుడి అంచనాలకు రెట్టింపు భరోసానిస్తుంది. అధిక ముగింపు గల ఫీచర్లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ప్రత్యేకించి గేమింగ్ ప్రేమికుల కోసం తీర్చిదద్దబడిన ఈ గ్యాడ్జెట్ క్వాలిటితో కూడిని వినోదానికిలోను చేస్తుంది.
Qosmio X870 ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:
17.3 అంగుళాల ట్రూబ్రైట్ హై డెఫినిషన్ ఎల్‌ఈడి స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 3డి డిస్‌ప్లే, హై డెఫినిషన్ వెబ్ కెమెరా, ఎన్-విడియా గ్రాఫిక్ ప్రాసెసర్, 2జీబి ఇంటర్నల్ మెమరీ, హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, ఆప్టికల్ బ్లూ రే డీవీడీ డ్రైవ్, హార్మన్ కార్డన్ స్టీరియో స్పీకర్స్.
వీనల విందైన అనుభూతుల సారాన్ని అంతిమంగా ఈ ల్యాపీ మీకందిస్తుంది. అత్యాధునిక సాంకేతిక విలువలతో కూడిన హై డెఫినిషన్, 3డి వ్యవస్థలను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చెయ్యటం వల్ల ఉత్తమ క్వాలిటీ డిస్‌ప్లేను మీరు పొందగలుగుతారు. ఏర్పాటు చేసిన ఎన్-విడియా గ్రాఫిక్ వ్యవస్థ ఉత్తమమైన పనితీరును కనబరుస్తుంది. ల్యాపీ ప్రాసెసర్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








