బిజీ..బిజీ మనషుల కోసం, ‘తోషిబా శాటిలైట్’!!

Posted By: Super

బిజీ..బిజీ మనషుల కోసం, ‘తోషిబా శాటిలైట్’!!

యాంత్రిక జీవన శైలితో ఒత్తిడికి లోనవుతున్న బిజీ..బిజీ మనుషులకు అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ల్యాప్‌టాప్ పరికరాన్నితోషిబా సంస్థ రూపొందించింది. ‘తోషిబా శాటిలైట్ L735-S3220RD’ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ మల్టీపర్పస్ నోట్‌బుక్ పరికరం త్వరలో అందుబాటులోకి రానుంది. ‘పాలిష్ రెడ్ డెక్’, ‘బ్లాక్ కీ సెట్‌’ తో డిజైన్ చేయుబడ్డ ఈ గ్యాడ్జెట్ అన్ని రకాల వినయోగదారులకు ఉపయుక్తంగా నిలుస్తుంది.

13.3 అంగుళాల డిస్‌ప్లే స్ర్ర్కీన్‌తో ఫిట్ చేయబడ్డ, ల్యాపీ కేవలం 4.3 పౌండ్ల బరువును కలిగి ఉంటుంది. ‘Core i5-2410 M CPU’ వ్యవస్థను ల్యాపీ యూనిట్‌లో రూపొందించారు. 4జీబీ మెమరీ వ్యవస్థ ల్యాపీ సామర్ధ్యాన్ని మరింత పెంచుతుంది. 1080 పిక్సల్ ‘హై డెఫినిషన్ నాణ్యత’తో ల్యాపీలోని వీడియోలను వీక్షించవచ్చు.

విండోస్ 7 హోమ్ ప్రీమీయమ్ ఆపరేటింగ్ వ్యవస్ధ ఆధారితంగా ‘తోషాబా శాటిలైట్ ల్యాపీ’ పనిచేస్తుంది. ‘వర్షన్ 2.0’ యూఎస్బీ పోర్టులను ల్యాపీలో ఏర్పాటు చేశారు. మరో ‘హెచ్‌డిఎమ్ఐ పోర్టు’ ల్యాపీని టీవీకి అనుసంధానించుకునేందుకు తోడ్పడుతుంది. ‘వైర్‌లెస్ ల్యాన్ వైఫై802,11b/g/n’, ‘ఇతర్ నెట్ 10/100’ వంటి ఫీచర్లు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.

‘బ్లూరే’ వ్యవస్ధ ల్యాపీకి మరో ఆకర్షణగా నిలుస్తుంది. ‘డీవీడీ కోరెల్’ వ్యవస్థను ముందుగానే నోట్‌బుక్‌లో లోడ్ చేశారు. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘తోషిబా శాటిలైట్ L735-S3220RD’ ధర రూ.24,000గా నిర్థారించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot