ఆ ‘శాటిలైట్’ స్పెషాలిటి ఏంటో..?

Posted By: Super

ఆ ‘శాటిలైట్’ స్పెషాలిటి ఏంటో..?


‘‘ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించే ఆ ‘శాటిలైట్’ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ ‘స్టోరీ’ చదవాల్సిందే ...’’

ప్రపంచ శ్రేణి సాంకేతిక పరికరాల తయారీదారు ‘తోషిబా’ ఓ సరికొత్త ఆవిష్కరణను సాంకేతిక విశ్వానికి అందించింది. ‘హై డెఫినిషన్’ మరియు ‘3డీ’అనుభూతుల కలయకతో ‘శాటిలైట్ P 750’ ల్యాపీని మార్కెట్లో విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికతతో ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచిన మల్టీ టాస్కింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.

రెండవ తరం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసింగ్ వ్యవస్థను గ్యాడ్జెట్లో పొందుపరిచారు. న్విడియా జీఫోర్స్ GT 540M మరియు న్విడియా గ్రాఫిక్ కార్డు అంశాలు నాణ్యమైన డిస్ ప్లే రిసల్యూషన్ తో మన్నికైన గ్రాఫిక్ విజువల్స్ ను విడుదల చేస్తాయి.

15.6 అంగుళాల డిస్ ప్లే హై డెఫినిషన్ పిక్షర్ క్వాలటి కలిగి న్విడియా 3డీ విజన్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. ఈ సౌలభ్యత కారణంగా శ్రోత సినిమాలు మరియు ఆటలాడే సందర్భంలో ధియోటర్ అనుభూతికి లోనవుతాడు. ఈ ల్యాపీని టెలివిజన్ కు అనుసంధానం చేసుకోవచ్చు.

750జీబీ హార్డ్ డ్రైవ్ వ్యవస్థ పటిష్ట మెమరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన స్పీకర్ వ్యవస్థ ఆడియోను నాణ్యమైన పరిమాణంలో అందిస్తుంది. పటిష్ట 6 సెల్ బ్యాటరీ వ్యవస్థను పీసీలో ఏర్పాటు చేశారు. 8x DVD మల్టీ రైటర్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, వై- ఫై వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. 2.6 కిలో గ్రాముల బరువుతో డిజైన్ కాబడ్డ ఈ ల్యాపీ ఒక సంవత్సరం వారంటీతో రూ.40,000లకు మార్కెట్లో లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot