మీకు ఇష్టమైన ఆటను హుందాగా ఆడండి!!!

Posted By: Staff

మీకు ఇష్టమైన ఆటను హుందాగా ఆడండి!!!

 

గేమింగ్ ప్రియుల కోసం అనేక వేరియంట్లలో ల్యాప్‌టాప్ప్ అందుబాటులోకి  వచ్చాయి. వీటిలో కొన్ని బ్రాండ్లు మాత్రమే  వినియోగదారుల మెప్పు పొందుగా, మిగిలిన బ్రాండ్లు  స్థూలమైన సమస్యలతో వినియోగదారులను మెప్పించలేక పోయాయి. ఈ విధమైన సమస్యలన్నింటిని అధిగమిస్తూ  తోషిబా (Toshiba) గేమింగ్‌కు అనువుగా ఉండే ల్యాపీని డిజైన్ చేసింది. ‘శాటిలైట్ P755’ వర్షన్‌‌లో  విడుదులైన ఈ ల్యాపీ స్పెసిఫికేషన్ల పై ఫోకస్...

కీలక  ఫీచర్లు:

ల్యాపీ పనితీరు వేగవంతంగా ఉండే విధంగా  ఇంటెల్ కోర్ i5-2410 ఎమ్ ప్రాసెసింగ్ వ్యవస్థను డివైజులో నిక్షిప్తం చేశారు. ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 2.3GHz, ర్యామ్ సామర్ధ్యం 6 జీబి, పొందుపరిచిన న్విడియా జీఫోర్స్  3410M గ్రాఫిక్ కార్డ్ మన్నికైన గ్రాఫిక్ విజువల్స్‌ను విడుదల చేస్తుంది. ల్యాపీలో ఏర్పాటు చేసిన  బ్లూ రే డ్రైవర్  అదే విధంగా న్విడియా 3డి (NVIDIA 3D) విజన్  వ్యవస్థలు వినోదాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. హై క్వాలిటీ సౌండ్‌ను విడుదల చేసే హార్మన్ కార్డన్ స్పీకర్స్ గేమింగ్ సమయంలో ఉత్కంఠతతో కూడిన అనుభూతులకు లోను చేస్తాయి.

డిస్‌ప్లే ఇతర  స్పెసిఫికేషన్లు:

15.6 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 1366x768 పిక్సల్స్, సౌకర్యవంతమైన కీ ప్యాడ్, ట్రాక్ ప్యాడ్,  ల్యాపీ బరువు 2.6 కిలో గ్రాములు, ధర  రూ.45,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting