తోషిబా నుంచి అల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌టాప్!

Posted By: Super

తోషిబా నుంచి అల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌టాప్!

టెక్నాలజీ ప్రపంచం విండోస్ 8 అల్ట్రాబుక్‌ల కోసం ఎదురుచూస్తున్న నేపధ్యంలో ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ తోషిబా తన శాటిలైట్ సిరీస్ నుంచి అత్యుత్తమ శ్రేణి అల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్‌ను వృద్ధి చేసింది. విండోస్ 7 ఆధారితంగా స్పందించే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ పేరు ‘శాటిలైట్ U845W’, ముందుగా ఫీచర్లు...

14.4 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1792 x 768పిక్సల్స్),

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

మందం 0.82 అంగుళాలు, బరువు 4 పౌండ్లు,

ప్రీలోడెడ్ స్నాప్ స్ర్కీన్ యుటిలిటీ,

ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసింగ్ యూనిట్,

6జీబి ర్యామ్,

500జీబి హార్డ్ డ్రైవ్,

ఇంటర్నెల్ స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి,

ఇతర్‌నెట్ జాక్,

యూఎస్బీ 3.0,

హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

బ్యాటరీ బ్యాకప్ 5 గంటలు,

ప్రారంభ ధర రూ.52,000.

తోషిబా శాటిలైట్ యూ845డబ్ల్యూ 14.4 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1792 x 768పిక్సల్స్. ఈ కాంభినేషన్ వినియోగదారుకు ఉత్తమ విజువల్ అనుభూతులకు లోను చేస్తుంది. స్లిమ్ ఇంకా తక్కువ బరువును కలిగి ఉండటంతో ల్యాపీని ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. పీసీలో శరీర నిర్మాణంలో భాగంగా ఉపయోగించిన ఆల్యూమినియమ్, రాగి లోహాలు క్లాసికల్ లుక్‌ను అందిస్తాయి. డివైజ్‌లో ముందస్తుగా లోడ్ చేసిన ‘స్నాప్ స్ర్కీన్ యుటిలిటీ’ ఫీచర్, యూజర్‌కు ఒకేసారి సైడ్ బై సైడ్ విండోలను వీక్షించే వెసలుబాటును కల్పిస్తుంది.

ప్రాససింగ్ అంశానికొస్తే ల్యాపీలో వినియోగించిన ఇంటెల్‌కోర్ ఐ5 ప్రాసెసర్, 6జీబి ర్యామ్ వ్యవస్థలు మెరుగైన పనితీరును కనబరుస్తాయి. 500జీబి హార్డ్‌డ్రైవ్ మెమరీని పదిలంగా భద్రపరుచుతుంది. ఉంచుతుంది. స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి.యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ వర్షన్ పై గ్యాడ్జెట్ రన్ అవుతంది. కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే ల్యాపీలో ఏర్పాటు చేసిన ఇతర్‌నెట్ జాక్, యూఎస్బీ 3.0, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ వ్యవస్థలు ఉత్తమ శ్రేణి ప్రదర్శనను కనబరుస్తాయి. బ్యాటరీ బ్యాకప్ 5 గంటల 13 నిమిషాలు. వివిధ వేరియంట్‌లలో లభ్యమవుతున్న తోషిబా శాటిలైట్ U845W ప్రారంభ ధర రూ.52,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot