తక్కువ మందం కలిగిన టాబ్లెట్ 'తోషిబా ఎగ్జైట్'

By Super
|
Toshiba thinnest tablet


తోషిబా తన ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త టాబ్లెట్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దాని పేరు 'తోషిబా ఎగ్జైట్'. 'తోషిబా ఎగ్జైట్' టాబ్లెట్‌ని జనవరిలో విడుదల చేయనుందని సమాచారం. కంపెనీ విడుదల చేసిన సమచారం ప్రకారం ప్రపంచంలో అతి తక్కువ మందం కలిగిన టాబ్లెట్‌గా దీనిని అభివర్ణిస్తున్నారు. 'తోషిబా ఎగ్జైట్' టాబ్లెట్ క్యాండీ బార్ మోడల్ టాబ్లెట్. టాబ్లెట్ చుట్టుకొలతలు 10.08 mm x 6.93 mm x 0.30 mm. టాబ్లెట్ బరువు 558 గ్రాములు.

టాబ్లెట్ ముందు భాగంలో 2 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయగా, అదే టాబ్లెట్ మెయిన్ కెమెరాగా 5 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. 'తోషిబా ఎగ్జైట్' టాబ్లెట్ పవర్ పుల్ ఫెర్పామెన్స్ అందించేందుకు గాను 1200MHz TI OMAP 4430 ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేశారు. టాబ్లెట్ మెమరీ 1024 MB. ఇక మెమరీ విషయానికి వస్తే ఈ టాబ్లెట్ 16జిబి, 32జిబి రెండింటిలోను లభ్యమవుతుంది.

'తోషిబా ఎగ్జైట్' టాబ్లెట్ ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 3.2 హానీకూంబ్ ఆపేరటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పై లను కూడా సపోర్ట్ చేస్తుంది. డేటాని వైర్ లెస్ ద్వారా ట్రాన్ఫర్ చేసుకునేందుకు గాను ఇందులో ఇంటిగ్రేటేడ్ బ్లూటూత్ అమర్చడం జరిగింది. వన్ ఇండియా పాఠకులకు 'తోషిబా ఎగ్జైట్' టాబ్లెట్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'తోషిబా ఎగ్జైట్' టాబ్లెట్ ప్రత్యేకతలు:

* Android 3.2 Honeycomb

* 10.1-inch display (1280 x 800)

* 7.7mm thin

* 558 grams

* 1.2 GHz dual-core TI OMAP4 CPU

* 1GB RAM

* Up to 64GB of built-in storage

* 5MP rear camera

* 2MP front camera

* 802.11 b/g/n Wi-Fi

* Stereo speakers

* microSD

* microHDMI

* microUSB

* Battery life at 8 hours for 100% video playback

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X