ప్రపంచపు అతి చిన్న టాబ్లెట్

Posted By: Staff

ప్రపంచపు అతి చిన్న టాబ్లెట్

 

జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన 'తోషిబా' వచ్చే వారం జరగనున్న కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రపంచంలో అతి తక్కువ మందం కలిగిన ఆల్టాబుక్, టాబ్లెట్‌ని విడుదల చేయనుంది. దీని ప్రత్యేకతలను గనుక గమనించినట్లేతే 10.1 ఇంచ్‌లు ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు అమెరికాలో మార్కెట్లో అతి తక్కువ మందం కలిగిన 'పోర్టెగె జడ్835' కంటే ఇంకా తక్కువగా ఉండబోతుందని వినికిడి.

దీనితో పాటు తోషిబా లాస్ వేగాస్‌లో జరగనున్న ఈ  కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో వాటర్ ఫ్రూఫ్ టాబ్లెట్‌ని కూడా ప్రవేశపెట్టనుంది. OLED స్కీన్‌తో 55 ఇంచ్ డిస్ ప్లే కలిగిన ఈ టాబ్లెట్ కస్టమర్స్‌కి 3డీ యూజర్ ఎక్స్ పీరియన్స్‌ని అందించనుంది. ఈ షోలో ఈ రెండు ప్రత్యేకం అయినప్పటికీ వీటితో పాటు ఈ షోలో మరిన్ని డిజిటల్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనుంది.

ఆల్ట్రా బుక్స్‌ని రూపొందించడంలో ప్రపంచంలో ఉన్న కంపెనీలలో తోషిబాది అందవేసిన చేయి అన్న విషయం అందరికి తెలిసిందే. టాబ్లెట్, ఆల్ట్రా బుక్‌‌కి సంబంధించిన పూర్తి సమాచారం వన్ ఇండియా కంప్యూటర్ ప్రేమికులకు అతి త్వరలో అందజేస్తాం..

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting