తోషిబా ‘అల్ట్రాబుక్’ రహస్యం ఏంటి..?

Posted By: Staff

తోషిబా ‘అల్ట్రాబుక్’ రహస్యం ఏంటి..?

దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు తోషిబా ప్రవేశపెట్టబోతున్న ప్రప్రధమ ‘అల్ట్రాబుక్’ వివరాలు బహిర్గతమయ్యాయి. తోషిబా ‘పోర్టిజీ Z830’ (Toshiba Portege Z830) పేరుతో విడుదలకాబోతున్న ఈ అల్ట్రామోడట్ ల్యాప్‌టాప్ 13 అంగుళాల పరిమాణం కలిగి స్లిమ్‌గా రూపుదిద్దుకుంది. ఆధునిక హంగులతో విడుదలకాబోతున్న ఈ మోడల్ ‘మ్యాక్ బుక్ ఎయిర్’కు పోటీదారుగా నిలువనుంది.

ప్రపంచ ల్యాపీల మార్కెట్లో మొట్టమొదటిగా 13 అంగుళాల స్లిమ్ స్వభావం కలిగి విడుదల కాబోతున్న పోర్టిజీ Z830 కేవలం 2.5 పౌండ్ల బరువు మాత్రమే ఉంటుంది. అల్ట్రాబుక్‌లో పొందుపరిరచిన 13.3 అంగుళాల ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ డిస్‌ప్లే, ఫ్లాష్ ఇంటర్నెల్ స్టోరేజి, విండోస్ 7, సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్ వ్యవస్థను వినియోగదారుడికి మరింత లబ్ధిచేకూరుస్తాయి.

ల్యాపీలో ఆవిష్కరించిన ప్రత్యేకతలను పరిశీలిస్తే, సిస్టం స్లీప్ మోడ్‌లో ఉన్నప్పటికి, యూఎస్బీ డివైజులకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పొందుపరిచిన ఆన్‌బోర్డు హెచ్‌‌డీ 300 గ్రాఫిక్ వ్యవస్థ హై రిసల్యూషన్ చిత్రాలను స్క్రీన్ పై డిస్‌ప్లే చేస్తుంది. ల్యాపీలో ఏర్పాటు చేసిన స్పిల్ రెసిస్టెన్స్ వ్యవస్థ డిస్‌ప్లే, కీ ప్యాడ్ వంటి భాగాలను సురక్షితంగా ఉంచుతుంది.

128జీబీ సామర్ధ్యం గల ఈ ‘అల్ట్రాబుక్’ను హనీకూంబ్ స్ట్రక్చర్, మగ్నిషియమ్ యలాయ్ ఛాసిస్‌తో లోడ్ చేశారు. పొందుపరిచిన యూఎస్బీ ఆధునిక వ్యవస్థలు v2.0, 3.0 శక్తివంతమైన పనితీరును కలిగి ఉంటాయి. ‘అల్ట్రాబుక్’లో పొందుపరిరచిన 1.3 మోగా పిక్సల్ కెమెరా నాణ్యమైన వీడియో కాన్ఫిరెన్సింగ్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. సెక్యూరిటీ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ రీడర్ వ్యవస్థ ఇతరులను ఆన్ చేయనివ్వకుండా చేస్తుంది. అయితే ల్యాపీ ధర విషయానికి సంబంధించి ఎటువంటి సమచారం లేదు. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే విధంగా ధరను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting