కొత్తదనం కోసం అలా చేసింది!!

Posted By: Prashanth

కొత్తదనం కోసం అలా చేసింది!!

 

ఏటీ 200 అనే టాబ్లెట్ పీసీని డిజైన్ చేసి ఆ విభాగంలోకి అడుగుపెట్టిన తోషిబా తాజాగా మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కనివిని ఎరగని విధంగా 13.3 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో టాబ్లెట్ పీసీని వ్ళద్ధి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శక్తింతమైన టెగ్రా 3 క్వార్‌కోర్ ప్రాసెసర్ పై ఈ టాబ్లెట్ రన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా.

స్ర్కీన్ సైజ్ పెద్దదిగా ఉన్నప్పటికి టాబ్లెట్ శరీరాక్ళతి స్లిమ్‌గా ఉంటుంది. తక్కువ బరువు కలిగిన ఈ డివైజ్ ప్రయాణ సందర్భాల్లో తీసుకువెళ్లేందుకు మరింత అనువుగా ఉంటుంది. పీసీ ముందు వెనుక భాగాలలో నిక్షిప్తం చేసిన కెమెరాలు అత్యుత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటాయి.

పీసీలో ఏర్పాటు చేసిన యూఎస్బీ వ్యవస్థ డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. అమర్చిన హెచ్‌డిఎమ్ఐ పోర్టు హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకునేందుకు తోడ్పడుతుంది. ఈ డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి సందిగ్థత నెలకుంది. తోషిబా మునపటి వర్షన్ AT 200 ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసింది. తాజాగా రాబోతున్న టాబ్లెట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot