విడుదలకు ముందే పుకార్లు షికార్లు!!

Posted By: Super

విడుదలకు ముందే పుకార్లు షికార్లు!!

 

టాబ్లెట్ సెక్టార్‌లో ‘తోషిబా’ తాజా డెవలప్‌మెంట్‌కు సంబంధించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ల్యాప్‌టాప్స్ అదేవిధంగా నోట్‌బుక్‌లను వృద్ధి చెయ్యటంలో నిక్కచ్చైన పనితీరును ప్రదర్శించే తోషిబా టెక్నాలజీస్ తాజాగా ‘ఎక్సైట్ ఎక్స్ 10’టాబ్లెట్ పీసీ డిజైనింగ్‌లోనూ అదే ధోరణిని అనుసరించినట్లు తెలుస్తోంది. తోషిబా లేటెస్ట్ టాబ్లెట్ ‘ఎక్సైట్ ఎక్స్ 10’ ఫీచర్లు ఖచ్చితమైన కంప్యూటింగ్ పనితనాన్ని కలిగి ఉన్నాయి. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లు వినియోగదారుడికి 100 శాతం భరోసానిస్తాయి.

టాబ్లెట్ ముఖ్య విశేషాలు:

* 10.1 అంగుళాల ఐపీఎస్ మల్టీ టచ్‌స్ర్కీన్, * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 2592 x 1944 పిక్సల్స్), * ప్రత్యక్ష వీడియో కాలింగ్ కోసం 2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * జీపీఆర్ఎస్ (క్లాస్ 12), * ఎడ్జ్ (క్లాస్ 12), * 3జీ (హెచ్ఎస్ డీపీఏ, 7.1ఎంబీపీఎస్), * వై-ఫై, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * హెచ్డీఎమ్ఐ కనెక్టువిటీ, * జీపీఎస్ ఫెసిలిటీ, * 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * మీడియా ప్లేయర్, * గేమ్స్, * ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ v3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.2 GH డ్యూయల్ కోర్ TI OMAP 4430ప్రాసెసర్.

గొరిల్లా గ్లాస్‌తో రూపొందించబడిన ఐపీఎస్ డిస్‌ప్లే పటిష్టవంతంగా ఉంటుంది. టచ్ స్ర్కీన్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన లౌడ్ స్పీకర్స్, ఎస్ఆర్ఎస్ ఆడియో అభివృద్ధి టెక్నాలజీలు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తాయి. హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం అధేవిధంగా డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌లు యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు దోహదపడతాయి. తోషిబా ఎక్సైట్ ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot