వాళ్ల కోసం స్పెషల్.. స్పెషల్‌గా!

Posted By: Staff

వాళ్ల కోసం స్పెషల్.. స్పెషల్‌గా!

 

 

చిన్నారుల కోసం  టాయ్స్‌రస్(ToysRus) సంస్థ డిజైన్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ టాబియో(Tabeo) అక్టోబర్ 21 నుంచి మార్కెట్లో లభ్యం కానుంది.  పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఫీచర్ల విషయానికొస్తే 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే ఉత్తమ విజువల్ అనుభూతులను అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. వోఎస్ వర్షన్‌కు సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది. టాబ్లెట్‌లో ముందుగానే లోడ్ చేసిన 50 అప్లికేషన్‌లు వినోదపు అవసరాలను సమృద్థిగా తీరుస్తాయి. వీటిలో ప్రధానంగా యాంగ్రీ బర్డ్స్, ఫ్రూట్ నింజా, ఐస్టోరీ బుక్స్ వంటి అప్లికేషన్‌లు ఆకట్టుకుంటాయి. మార్కెట్ ధర రూ. 8,500.

Read in English:

బుడతల కోసం మరో టాబ్లెట్ ‘ఆర్చోస్ చైల్డ్ ప్యాడ్’!

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ బ్రాండ్ ఆర్చోస్ చిన్నారుల కోసం సరికొత్త టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. పేరు ‘ఆర్చోస్ చైల్డ్ ప్యాడ్’. చిన్నారులు మెచ్చే రీతిలో అనేకమైన ఆధునిక ఫీచర్లను ఈ గ్యాడ్జెట్‌లో లోడ్ చేశారు. మందుగా ఇన్స్‌టాల్ చేసిన వివిధ గేమింగ్ అప్లికేషన్‌లు పిల్లలను అబ్బురపరుస్తాయి. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో రూపుదిద్దుకున్న ‘ఆర్చోస్ చైల్డ్ ప్యాడ్’ చిన్నారల పాలిట చక్కటి నేస్తం…

టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే:

7 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ క్లాక్ వేగం కలిగిన ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 2,000 మ్యూజిక్ ట్రాక్‌లు లేదా 5 సినిమాలు స్టోర్ చేసేకునేంత ఇంటర్నల్ మెమరీ, ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్, వెబ్‌క్యామ్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, మన్నికైన బ్యాకప్ నిచ్చే లి-పాలిమర్ బ్యాటరీ, చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ‘చైల్ట్ సేఫ్ వెబ్ బ్రౌజింగ్’ అప్టికేషన్‌ను టాబ్లెట్టో లోడ్ చేశారు. ఈ సౌలభ్యతతో చిన్నారులు జ్ఞానపరమైన అంశాలతో పాటు విద్య సంబంధిత విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవచ్చు. మార్కెట్లో ఈ వారం విడుదలకాబోతున్న ‘ఆర్చోస్ చైల్ట్ ప్యాడ్’ ధర అంచనా రూ. 7,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot