బ్లూటూత్ కన్నా ఫాస్టెస్ట్ టెక్నాలజీ..?

Posted By: Super

బ్లూటూత్ కన్నా ఫాస్టెస్ట్ టెక్నాలజీ..?

 

కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ సెగ్మెంట్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ‘తోషిబా’ భవిష్యత్ తరం టెక్నాలజీ పై దృష్టిసారించింది. బ్లూటూత్ వ్యవస్థకన్నా వేగవంతంగా స్పందించే ట్రాన్స్‌ఫర్ జెట్ టెక్నాలజీని తోషిబా రూపొందించింది.

తోషిబా రూపొందించబోతున్న కంప్యూటింగ్ పరికరాలన్నింటిలో ఈ సాంకేతికతను ప్రవేశపెట్టనున్నారు. తాజా డవలెప్‌మెంట్ తోషిబాకు కలిసొచ్చే అంశంగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ట్రాన్స్‌ఫర్ జెట్ టెక్నాలజీ రానున్న తోషిబా టాబ్లెట్‌లలో నిక్షిప్తం కానుంది. ఈ టెక్నాలజీ డేటా ట్రాన్సఫర్ గరిష్ట వేగం 560Mbps. బ్లూటూత్‌తో పోలిస్తే తక్కువ పవర్‌ను ఈ వ్యవస్థ ఖర్చు చేస్తుంది. సులువైన ఆపరేటింగ్ విధానం ద్వారా ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవచ్చు. వినియోగదారులకు వేగవంతమైన టెక్నాలజీ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot