దిగ్గజాల త్రిముఖ పోరు..?

Posted By: Staff

దిగ్గజాల త్రిముఖ పోరు..?

 

ఈ ఏడాది టాబ్లెట్ పీసీల సెక్టార్‌లో  మూడు దిగ్గజాల మధ్య త్రీముఖ పోరు చోటుచేసుకోనుంది. ఆమోజన్ కిండిల్ ఫైర్‌ను ఎదుర్కొనే క్రమంలో  ఆపిల్ 7.85 అంగుళాల పరిమాణం గల ఐప్యాడ్‌ను డిజైన్ చేస్తున్నట్లు  విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

సెర్చ్ ఇంజన్ గెయింట్ గుగూల్ సైతం 7 అంగుళాల ప్యానెల్‌తో  ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే టాబ్లెట్ పీసీని ఈ ఏడాది విడుదల చేసే యోచనలో ఉన్నట్లు  స్పష్టమవుతోంది.

విశ్లేషకుల అంచనాల ప్రకారం ఆపిల్‌కు చెందిన  మిలియన్ కస్టమర్లను  ఆమేజోన్ కిండిల్ ఫైర్ తన వైపుకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ఈ బరిలోకి దిగితే ఈ దిగ్గజాల మధ్య పోటి మరింత వాడి వేడిగా ఉంటుందని మార్కెట్ వర్గాలు  స్పష్టం చేస్తున్నాయి.

ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాడ్జెట్  బ్రాండ్‌ల మధ్య జరిగే  ట్రైయాంగిల్ పోరులో ఎవరు  పై చేయి సాధిస్తారో వేచి చూద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot