అమ్మో... 22 అంగుళాలా?

Posted By: Super

అమ్మో... 22 అంగుళాలా?

 

టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న ఆపిల్, ఆమోజన్, శామ్‌సంగ్ తదితర ప్రముఖ కంపెనీలకు ‘వ్యూసోనిక్’ దిమ్మతిరిగే షాకివ్వబోతోంది. ఇప్పటి వరకు 7, 9, 10 అంగుళాల స్ర్కీన్ వేరింయంట్‌లలోని టాబ్లెట్ కంప్యూటర్లను మాత్రమే ఆయా కంపెనీలు డిజైన్ చేశాయి. ఇక పై 22 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన బడా టాబ్లెట్ కంప్యూటర్‌ను మనం చూడబోతున్నాం. వ్యూసోనిక్ ఈ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ డివైజ్‌కు సంబంధించిన సమాచారాన్ని త్వరలో నిర్వహించే ‘కంప్యూటెక్స్’ కార్యక్రమంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ కంప్యూటింగ్ పరికరానికి సంబంధించి ఓ టీసర్‌ను ఇప్పటికే లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా డివైజ్ రన్ అవుతుంది. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

వ్యూప్యాడ్ ఇ100!

అమెరికా కంప్యూటర్ల తయారీ సంస్థ వ్యూసోనిక్ , వ్యూప్యాడ్ ఇ100 పేరుతో టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. జూన్ నాటికి ఈ డివైజ్ యూరప్‌లో అందుబాటులోకి రానుంది.

టాబ్లెట్ ఫీచర్లు:

9.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

బరువు 625 గ్రాములు,

గుగూల్ ఆండ్రాయిడ్ 4.0.3 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్ ఆర్మ్ కార్టెక్స్ -ఏ9,

1జిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

3జీ సపోర్ట్,

వై-ఫై,

బ్లూటూత్,

హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

యూఎస్బీ సపోర్ట్,

జీపీఎస్ ఫెసిలిటీ.

రెండు వేరియంట్‌లలో ఈ పీసీ లభ్యం కానుంది. వీటి ధరలను పరిశీలిస్తే వ్యూప్యాడ్ ఇ100 వై-ఫై మోడల్ ధర రూ.20,000, వై-ఫై ప్లస్ 3జీ మోడల్ ధర రూ.26,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot