ఫీచర్లు చాలానే ఉన్నాయ్..!! ధర ఎక్కువనుకుంటే పొరపాటే..?

Posted By: Prashanth

ఫీచర్లు చాలానే ఉన్నాయ్..!! ధర ఎక్కువనుకుంటే పొరపాటే..?

 

ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే రెండు ఉత్తమ క్వాలిటీ టాబ్లెట్ కంప్యూటర్‌లను చవక ధరకే అందించేందుకు చినాన్ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ డివైజ్‌లు యూఎస్‌లో లభ్యమవుతున్నాయి. చినాన్ స్విఫ్ట్ 7, చినాన్ స్విఫ్ట్ 10 నమూనాలలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌లు మెరుగైన బ్యాకప్‌తో యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు తోడ్పడుతాయి. సమంజసమైన ధరలకే లభ్యంకానున్న తమ ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలు పనితీరు విషయంలో ఏమాత్రం రాజీపడవని, చినాన్ అధ్యక్షడు స్పష్టం చేశారు. వేగవంతమైన కంప్యూటింగ్ కోరుకునే వారికి ఈ డివైజ్ పూర్తి స్థాయిలో దోహదపడుతుందని వివరించారు.

చినాన్ స్విఫ్ట్ 7:

* 7 అంగుళాల సూపర్ బ్రైట్ మల్టీ‌టచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, * 4జీబి ఇంటర్నల్ మెమరీ, * సూపర్ ఫాస్ట్ వై-ఫై టెక్నాలజీ, * ఆర్మ్ కార్టెక్స్ -ఏ8 కోర్ 1.2GHz ప్రాసెసర్, * డిజిటల్ ఫోటోగ్రఫీ వ్యవస్థ, * ఇ-బుక్ రీడర్, * 3డి గేమింగ్ సౌలభ్యత. * గైరో సెన్సార్స్, * ధర రూ.8,000.

చినాన్ స్విప్ట్ 10:

* 10 అంగుళాల సూపర్ బ్రైట్ మల్టీ‌టచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, * 16జీబి ఇంటర్నల్ మెమరీ, * సూపర్ ఫాస్ట్ వై-ఫై టెక్నాలజీ, * ఆర్మ్ కార్టెక్స్ -ఏ8 కోర్ 1.2GHz ప్రాసెసర్, * డిజిటల్ ఫోటోగ్రఫీ వ్యవస్థ, * ఇ-బుక్ రీడర్, * 3డి గేమింగ్ సౌలభ్యత. * గైరో సెన్సార్స్, * ధర రూ.14,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot