ఆ రెండు మోడల్స్ ఇండస్ట్రీని దున్నేస్తాయా..?

Posted By: Staff

ఆ రెండు మోడల్స్ ఇండస్ట్రీని దున్నేస్తాయా..?

 

కంప్యూటర్ పరికరాల తయారీలో క్లాసికల్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకన్న ఫుజిట్సు, ఇంటెల్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లతో కూడిన లైఫ్‌బుక్‌లను రెండు వేరియంట్‌లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. లైఫ్‌బుక్ LH532, లైఫ్‌బుక్ LH772 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు కంప్యూటింగ్ ప్రపంచాన్ని శాసించగల సత్తాని కలిగి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి రాకతో నోట్‌బుక్ మార్కెట్ కొత్త శోభను సంతరించుకోనుందని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

లైఫ్‌బుక్ LH532 ప్రధాన ఫీచర్లు

14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్1366×768పిక్సల్స్) ,

మూడవ తరం కోర్ ఐ7 ప్రాసెసింగ్ వ్యవస్ద,

సిస్టం మెమెరీ 2జీబి,

ఎన్-విడియా జీఫోర్స్ జీటీ620ఎమ్ గ్రాఫిక్ వ్యవస్థ,

వీడియో ర్యామ్ సామర్ద్యం 2జీబి.

లైఫ్ బుక్ LH772 ప్రధాన ఫీచర్లు:

14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

ఐవీ బ్రిడ్జ్ కోర్ ఐ7 ప్రాసెసింగ్ వ్యవస్థ,

4జీబి సామర్ద్యం గల ర్యామ్,

Onkyo బాక్స్ స్పీకర్స్,

డీటీఎస్ UltraPC II ప్లస్,

ఫింగర్ ఫ్రింట్ సెన్సార్.

మార్కెట్లో వీటి ధర, విడుదలుకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్యాడ్జెట్లు ఉత్తమమైన పనితీరును ప్రదర్శిస్తాయనటంలో ఏమాత్రం సంకోంచం లేదు.

చమ్మ వాతావరణంలో సైతం ట్రబుల్ ఫ్రీగా!!

సొగసరి బ్రాండ్ ఫుజిట్సు ‘స్టైలిస్టిక్ M532’ మోడల్ లో 10 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ కంప్యూటర్ ను లాంఛ్ చేసింది. చమ్మ వాతావరణంలో సైతం ట్రబుల్ ఫ్రీగా పనిచేసే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దామా…….

టాబ్టెట్ డిస్ ప్లే పరిమాణం 10.1 అంగుళాలు (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్), సాధారణ ప్రాసెసర్ లతో పోలిస్తే నాలుగు రెట్టు సమర్ధవంతంగా పని చేసే న్విడియా టెగ్రా 3 సిలికాన్ ప్రాసెసర్ ను డివైజ్ లో బలోపేతం చేశారు. ఈ ప్రాసెసర్ క్లాక్ వేగం 2GHz. టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్పల్ కెమెరా క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. ముందు భాగంలో అమర్చిన 3 మెగా పిక్సల్ కెమెరా లైవ్ వీడియో ఛాటింగ్ కు దోహదపడుతుంది. ఇంటర్నల్ మెమరీ 16జీబీ. మైక్రో యూఎస్బీ పోర్టులను డివైజ్ సైడ్ భాగంలో ఏర్పాటు చేశారు. మరిన్ని ఉపయుక్తమైన ఫీచర్లను ఈ పీసీలో దోహదం చేశారు. అతి త్వరలో విడుదల కాబోతున్న ‘ఫుజిస్టు స్టైలిస్టిక్ M532’ ఇండియన్ మార్కెట్ విలువ రూ.34,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot