Home
Computer

ఈ సారి ఏం జరుగుతుందో...?

By Prashanth
Ubislate 7


ప్రపంచపు చవక టాబ్లెట్ కంప్యూటర్ ఆకాష్‌ను 2011, చివరి త్రైమాసికంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి, 2012 నాటికి ఈ డివైజ్ అందుబాటులోకి వస్తుందని చెప్పినప్పటికి విడుదల విషయంలో జాప్యం జరుగుతూనే వస్తుంది. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే క్రమంలో విద్యార్థుల కోసం ఆకాష్‌ను డిజైన్ చెయ్యగా, రిటైల్ వర్షన్ కోసం యూబీస్లేట్ 7ను రూపొందించారు.

రిటైల్ వర్షన్ టాబ్లెట్, యూబీస్లేట్‌కు సంబంధించి తయారీదారు డేటావిండ్ గత నెలలో కీలక వివరాలను ప్రకటించింది. వాటి వివరాలు.. 7+, 7C వేరియంట్‌లలో యూబీస్లేట్‌ను డిజైన్ చేశారు. ఇండియాలో వీటి ధరలు 7+ (రూ.2,999), 7సీ (రూ.3,999). వీటి ఫీచర్లను పరిశీలిస్తే ఇంచుమించు సమానప్రాతిపదికను కలిగి ఉంటాయి.

7సీ వర్షన్ 4జీబి ఇంటర్నల్ ఫ్లాష్ మెమెరీని కలిగి ఉండగా, 7+ వర్షన్ 2జీబి ఇంటర్నల్ మెమెరీతో సరిపెట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఇవి రన్ అవుతాయి. 800మెగాహెడ్జ్ సామర్ధ్యం గల ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్లకు తోడుగా 256 ఎంబీ ర్యామ్‌లను ఈ గ్యాడ్జెట్‌లలో నిక్షిప్తం చేశారు. 7 అంగుళాల పరిణామం గల మల్టీ టచ్‌స్రీన్ 800 x 480పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. వై-ఫై వంటి నెట్‌వర్క్ కనెక్టువిటీ సౌలభ్యతలను ఈ రెండు వేరియంట్లు కలిగి ఉంటాయి.

ఈ డివైజులకు సంబంధించి ముందస్తు ఆర్డర్లను త్వరలోనే ఆహ్వానిస్తామని డేటావిండ్ వర్గాలు ప్రకటించాయి. రిటైల్ స్టోర్‌లలో ఈ గ్యాడ్జెట్లు లభ్యమవటానికి మరి కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సైట్ ‘డీల్స్ అండ్ యూ’,యూబీస్లేట్ 7+ ధరను రూ.2,999గా ప్రకటించింది. అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్.. క్యాష్ ఆన్ డెలివరీ వంటి ఆప్షన్‌లను యూజర్‌కు అందిస్తుంది. ఆర్డ్రర్ చేసిన వారికి టాబ్లెట్ల పంపిణి వ్యవహారంలో ఆకాష్ పట్ల దేశవ్యాప్తంగా అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపధ్యంలో యూబీస్టేట్ టాబ్లెట్ పీసీలను యూజర్లు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X