‘ఆండ్రాయిడ్ వోఎస్’కు చెక్ తప్పదా..?

Posted By: Super

‘ఆండ్రాయిడ్ వోఎస్’కు చెక్ తప్పదా..?

 

ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రేమికులకు సుపరిచితమైన ‘ఆండ్రాయిడ్’ అనేక గ్యాడ్జెట్‌ల విజయానికి మూలకారకంగా నిలిచింది. ప్రముఖ బ్రాండ్లన్ని ఆండ్రాయిడ్ వోఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. అయితే రానున్న కాలంలో ఆండ్రాయిడ్ దూకుడుకు బ్రేకులు పడొచ్చనా ఊహాగానాలు బలంగా వీస్తున్నాయి. GNU/LINUX ఆధారిత ఆపరేటింగ్ సిస్టం ‘వుబుంటు’(Ubuntu), గుగూల్ ‘ఆండ్రాయిడ్’ అదే విధంగా ఆపిల్ ‘ఐవోఎస్’లకు ప్రత్యామ్నాయంగా నిలవనుందని విశ్లేషణలు అంచనా వేస్తున్నాయి.

వుబుంటు ‘రిమిక్స్ ఆపరేటింగ్ సిస్టం’తో నెట్‌బుక్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించిన వుబుంటు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్లలేకపోయింది. ఈ క్రమంలో శక్తివంతమైన టాబ్లెట్ పీసీని డవలెప్ చేసే యోచనలో ‘వుబుంటు’ ఉన్నట్లు సమచారం. ఈ ఏడాది చివరి నాటికి యూజర్ ఫ్రెండ్లీ కంఫర్ట్ కంప్యూటింగ్ ఆపరేటింగ్ సిస్టం వుబుంటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టాబ్లెట్ పీసీల సెక్టార్‌లో, ఆండ్రాయిడ్ ఆధానిత టాబ్లెట్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఆ తరువాతి స్థానాన్ని ‘ఐవోఎస్’ ఆధారిత ఆపిల్ టాబ్లెట్‌లు అధిరోహించాయి. మైక్రో‌సాఫ్ట్ విండోస్ తాజాగా ‘విండోస్ 8’ఆధారిత టాబ్లెట్‌లను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. చిప్ మరియు ప్రాసెసర్‌ల తయారీదారు ఇంటెల్ ‘టింజన్ వోఎస్’ ఆధారితంగా పనిచేసే టాబ్లెట్‌లను రూపొందిస్తున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot