ఆ ఒక్క ‘ఫిగర్’ కోసం ముగ్గరు లైన్లో ఉన్నారు..!!

By Super
|
Ultrabooks
బీకర యుద్ధానికి ‘వేదిక’ ఖారారైంది.. ‘భవిష్యత్తు’ను నిర్థారించే ఈ పోరు సమవుజ్జీల మధ్య సాగబోతుంది. ఎంతో చాకిచక్యంగా రూపొందించిన తమ ఆయుధాలకు ఆయా సమరయోధులు సైన్యం సానపెడుతుంది., తాడో పేడో తేల్చుకునే ఈ పోరులో ‘ఆ అదృష్టం’ ఎవరిని వరిస్తుందో.., శత కోటి ఆశల సమర భేరిలో ఎవరు ‘విశ్వ విఖ్యాత’గా నిలుస్తారో... వేచి చూద్దాం..

ఈ కాన్సెప్ట్ ఏదో పౌరాణిక సినిమాల్లో యుద్ధ ఖాండను తలపించే ఘట్టంలా ఉంది కదండీ..!, జరిగేది యుద్ధమే.., కాని మనుషుల మధ్య కాదు, ఆయుధాలు వాస్తవమే.. కాని కత్తులు, బాంబులతో కాదు. ప్రస్తుత ప్రపంచంలో రాజుకున్న సాంకేతిక విప్లవం.. ‘సాంకేతిక పోరు’లా మారి యుద్ధవాతవరణాన్ని తలపిస్తుంది. సాంకేతిక పరికరాల తయారీలో ‘నెంబర్ వన్’ బ్రాండ్లు మొదలుకుని నిన్నమొన్న వెలిసిన ‘చిన్న బ్రాండ్ల’ వరకు ఆధిపత్యం కోసం పరితపిస్తున్నాయి. ఈ పరిణామాలతో సాంకేతిక వ్యవస్థ రోజుకో కొత్త రూపు సంతరించుకుంటుంది. అసలు విషయానికి వస్తే ప్రపంచ సాంకేతిక దిగ్గజాలైన ఆపిల్, అసస్, ఏసర్ సంస్థలు తమ సరికొత్త ల్యాప్‌టాప్లను మార్కెట్లో విడుదల చేసి ‘ప్రపంచ ల్యాప్‌టాప్‌ల మార్కెట్‌ను’ వసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

ప్రస్తుత ల్యాప్‌టాప్ మార్కెట్లో తాజా ఒరవడిని పరిశీలిస్తే ‘బరువు తక్కువ ల్యాప్‌టాప్‌లకు’ మంచి ఆదరణ ఉంది. అయితే ఈ ల్యాప్‌టాప్‌లకు ‘అల్ట్రా‌బుక్స్’గా నామకరణం చేశారు. తాము విడుదల చేయుబోతున్న ఈ ‘జీరో సైజు ల్యాప్‌టాప్‌లు’ వ్యాపారంలో కొత్త ఒరవడిని సృష్టిస్తాయని దిగ్గజ బ్రాండ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. తక్కువ బరువుతో పాటు అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్న ఈ అల్ట్రా ల్యాప్‌టాప్‌లు అమ్మకాలు భారీ స్థాయిలోనే జరగొచ్చని విశ్లేషక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వినియోగదారుల్లో అత్యధిక మంది అత్యుత్తమ పనితీరు కలిగి ఉన్న సాంకేతిక పరికాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు.

వినియోగదారుల్లో ల్యాప్‌టాప్‌ల పట్ల మరింత అసక్తి పెంచేందుకు, ఈ అల్ట్రా పోర్టబుల్ ల్యాపీలను వృద్ధి చేసినట్లు తెలుస్తోంది. టాబ్లెట్ పీసీలో ఉన్న అన్ని సౌలభ్యతలు, ఈ సరికొత్త ‘అల్ట్రా బుక్స్’ ల్యాపీలలో కలిగి ఉంటాయి. బరువు విషయంలో కూడా. భారతీయ మార్కెట్లో ‘అల్ట్రా బుక్స్’ ల్యాప్‌టాప్ విషయానికి వస్తే, అసస్ ‘UX21’ పేరుతో పేరుతో జిరో సైజు ల్యాప్‌టాప్‌ను వచ్చే సంవత్సరం తొలి క్వార్టర్‌లో ప్రవేశపెట్టనుంది అయితే ఈ ‘ల్యాపీ’ ధర రూ.50,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అసస్ విడుదల వెను వెంటనే ‘ఏసర్’ తన ల్యాపీలను ప్రవేశపెట్టనుంది.

ఈ ‘అల్ట్రా బుక్’లకు సంబంధించిన వ్యవస్ధను 300 మిలియన్ డాలర్లను వెచ్చించి ఇంటెల్ సమకూరుస్తుంది. వీటి స్పెసిఫికేషన్ అంశాలను పరిశీలిస్తే 1 అంగుళం మందంతో, 1 కేజి బరువు కలిగి ఉంటాయి. 11 నుంచి 13 అంగుళాల డిస్ ప్లే సామర్ధ్యం కలిగి అత్యాధునిక కీ బోర్డు వ్యవస్థను కలిగి ఉంటాయి. నోట్ బుక్, ల్యాప్‌టాప్‌లలో ఉంటే సాధారణ ఫీచర్లన్న ఈ జీరో సైజు ల్యాపీలలో ఉంటాయి. అయితే మంచి దూకుడు మీదున్న ‘అసస్’, ‘ఏసర్’లకు గట్టి పోటీనే ఎదురయ్యంది. దిగ్గజ బ్రాండ్ ‘ఆపిల్’, తాజాగా ‘ఆపిల్ మ్యాక్‌‌బుక్’ పేరుతో అధునాతన ల్యాపీని మార్కెట్లో విడుదల చేయునుంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరు అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తారో వేచి చూడాలి మరీ..!!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X